Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-May-2016 17:15:03
facebook Twitter Googleplus
Photo

తనకు పెళ్ళయినప్పటినుండి నల్ల రంగు రేంజ్ రోవర్ కారునే వాడుతున్నాడు జూ.ఎన్టీఆర్. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా రిజిస్ట్రేషన్ కలిగియున్న (AP 37 AX 9999) రేంజ్ రోవర్ కారంటే.. మనోడికి బీభత్సమైన సెంటిమెంట్. ఇకపోతే ఈ మధ్యనే ఈ కారు మైత్రీవనం సిగ్నల్ దగ్గర నల్ల రంగు టింట్ కలిగియుందని.. పోలీసులతో ఫైన్ వేయించుకున్న సంగతి తెలిసిందే.

అయితే ఎన్టీఆర్ కూడా ఈ 'రేంజ్' కు స్వస్తీ చెప్పాలని డిసైడ్ అయిపోయి.. కొత్త బి.ఎమ్.డబ్ల్యూ కారును కొన్నాడు. ఈ 7 సీరీస్ కారు (TS 09 EL 9999)లోనే ఇప్పుడు మనోడు ఎక్కడ చూసినా చెక్కర్లు కొడుతున్నాడు. తన నల్లరంగు రేంజ్ రోవర్ ను పూర్తిగా గ్యారేజ్ కే పరిమితం చేసేశాడు. దానిని ఎవరైనా నార్త్ సైడ్ కష్టమర్ కు డిస్పోజ్ చేసేద్దాం అనుకుంటున్నాడట. ఎందుకో ఆ కారు తనకు అచ్చిరావట్లేదని ఫిక్స్ అయ్యాడట. నెంబర్లన్నీ కలిపితే.. టోటల్ 1 వస్తోందని ఫీలయ్యి.. ఇప్పుడు ఖైరతాబాద్ రిజిస్ట్రేషన్ ప్రకారం టోటల్ 9 వచ్చేలా తీసుకున్నాడు. అది సంగతి.

ఇకపోతే సాధారణంగా సెలబ్రిటీలు వాడిన కార్లను మరో సెలబ్రిటీ కొనడం అనే ఆనవాయితీ ఒకటుంది. గతంలో చిరంజీవి వాడేసి అమ్మేసిన రేంజ్ రోవర్ ను రవితేజ.. అలా చాలామంది పెద్ద పెద్ద స్టార్ల కొన్న ఘటనలు ఉన్నాయి. మరి ఎన్టీఆర్ కారును ఎవరైనా కొనుక్కుంటారా?

,  ,  ,  ,  ,  ,