Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-May-2017 10:17:19
facebook Twitter Googleplus
Photo

ఒక ప్రాజెక్ట్ కోసం ఐదారేళ్ల సమయం.. ఒక్క సినిమా కోసం ఇంత సుదీర్ఘ కాలం కేటాయించాలంటే.. ఎవరైనా ఒకటికి వంద సార్లు ఆలోచిస్తారు. కానీ దర్శకధీరుడు రాజమౌళి మాత్రం ఎంతో ధైర్యంగా బాహుబలి ప్రాజెక్ట్ మొదలుపెట్టాడు. జక్నన్నపై ఉన్న నమ్మకంతో నిర్మాతలతో పాటు టీం అంతా తమ విలువైన సమయాన్ని కేటాయించారు.

దానికి ప్రతిఫలం.. ఇప్పుడు రికార్డుల రూపంలో అందుతోంది. బాహుబలి ది బిగినింగ్ సృష్టించిన సంచలనాలు ఒక ఎత్తయితే.. బాహుబలి ది కంక్లూజన్ మొత్తం భారతీయ సినిమా చరిత్రనే మార్చేస్తోంది. ఐదేళ్ల పాటు కష్టపడ్డందుకు ఆడియన్స్ నుంచి ఈ స్థాయిలో ప్రతిస్పందనతో కూడా ప్రతిఫలం అందుతుండడంతో.. టీం అంతా తెగ ఆనందంగా ఉన్నారు. ఎంత ఆనందంగా ఉన్నారో చెప్పేందుకు బాహుబలి ప్రధాన టీం అంతా దిగిన ఈ ఒక్క సెల్ఫీ సరిపోతుందేమో. ప్రతీ ఒక్కరి కళ్లలో కనిపిస్తున్న సంతోషం ముందు.. అంతటి ఘన విజయం కూడా చిన్నదే అనిపించడంలో ఆశ్చర్యం లేదు.

ఈ ఫోటోలో రానా.. సత్యరాజ్.. కీరవాణి.. శ్రీవల్లిలు మిస్ అయ్యారు.

,  ,  ,  ,  ,  ,