Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Apr-2017 11:06:40
facebook Twitter Googleplus
Photo

బాహుబలి: ది కంక్లూజన్ రిలీజ్ ఏప్రిల్ 28న కదా.. మొన్ననే డేట్ మరోసారి కన్ఫమ్ చేశారు కదా.. ఉన్నట్లుండి ఈ ప్రిపోన్మెంట్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఏడో తారీఖున రిలీజవుతున్నది ది కంక్లూజన్ కాదు. ది బిగినింగ్. అవును బాహుబలి మొదటి భాగాన్ని ఏప్రిల్ 7న మళ్లీ విడుదల చేస్తున్నారు.

ది కంక్లూజన్ విడుదలకు ముందు బజ్ మరింత పెంచేందుకు దేశవ్యాప్తంగా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నారు. ఐతే ఇలా రిలీజవుతున్నది హిందీ వెర్షన్ మాత్రమే. తొలి భాగం విడుదలైన సమయంలో హిందీ వెర్షన్ జనాల్లోకి వెళ్లడానికి కొంత సమయం పట్టింది ఈ లోపు సినిమా కొన్ని చోట్ల ఖాళీ అయిపోయింది. ఆ తర్వాత ప్రేక్షకులు చాలామంది టీవీల్లో.. ఇంటర్నెట్లో సినిమా చూశారు. అలాంటి ప్రేక్షకులు ది కంక్లూజన్ కంటే ముందు ఒకసారి ది బిగినింగ్ ను వెండితెరపై చూసుకుని.. రెండో భాగానికి తగ్గ ఎగ్జైట్మెంట్ తెచ్చుకుంటారని భావిస్తున్నట్లున్నాడు కరణ్ జోహార్. ఈ నిర్ణయం ఆయనదేనట.

ఏఏ ఫిలిమ్స్ దేశవ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతోంది. ఒక కొత్త సినిమా స్థాయిలో బాహుబలిః ది బిగినింగ్ ను రిలీజ్ చేస్తారట. బాహుబలి-2 రిలీజ్ ఏప్రిల్ 7 న రాబోయే కొత్త సినిమాలపై కొంత మేర ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,