Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Dec-2017 11:06:21
facebook Twitter Googleplus
Photo

ఏప్రిల్ 28న విడుదలై ఇండియాలోనే కాక ప్రపంచంలో పలు దేశాల్లో కలెక్షన్ల వర్షం కురిపించింది బాహుబలి: ది కంక్లూజన్. ఏకంగా 1700 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో సంచలనం సృఫ్టించిందీ సినిమా. బాహుబలి: ది బిగినింగ్ తరహాలోనే ముందు ఇండియాలో.. కొన్ని దేశాల్లో సినిమాను రిలీజ్ చేసి.. ఆ తర్వాత మిగతా దేశాలపై దృష్టిసారించింది చిత్ర బృందం. చైనాలో ది కంక్లూజన్ ను భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేశారు కానీ.. అనివార్య కారణాల వల్ల అక్కడ ఇంకా ఆ చిత్రం రిలీజవ్వలేదు. ఐతే ఇప్పుడు మరో ఆసియా దేశం జపాన్ లో ఈ చిత్రం పెద్ద ఎత్తున రిలీజవ్వబోతోంది.

డిసెంబరు 29న జపాన్ ప్రేక్షకుల్ని పలకరించబోతోంది బాహుబలి: ది కంక్లూజన్. గత కొన్నేళ్లలో సౌత్ ఇండియన్ సినిమాలకు జపాన్ లో ఆదరణ బాగా పెరిగింది. రజినీకాంత్ అక్కడ కూడా సూపర్ స్టారే. ఆయన సినిమాలు భారీ ఎత్తున రిలీజవుతాయి. మన స్టార్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ కు జపాన్లో మంచి ఫాలోయింగ్ ఉంది. బాహుబలి: ది బిగినింగ్ జపాన్లో మంచి వసూళ్లు రాబట్టింది. ది కంక్లూజన్ కూడా అక్కడ మంచి ఫలితమే అందుకుంటుందని భావిస్తున్నారు. అక్కడ పబ్లిసిటీ కూడా బాగానే చేస్తున్నారు. ఈ రోజు బాహుబలి-2 జపాన్ లాంగ్వేజ్ పోస్టర్ కూడా లాంచ్ చేశారు.

,  ,  ,  ,  ,  ,