Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-May-2017 12:26:06
facebook Twitter Googleplus
Photo

బాహుబలి 2 విడుదలై వారం కావొస్తుంది. ఇప్పటికీ టికెట్ బాకసరుడులా థియేటర్లో ఉన్న అన్నీ టికెట్లు తింటోంది. బాహుబలి గర్జనకు మరేది వచ్చినా దానికి మిగిలేది పొందేది ఏమి ఉండదు. ఇలాంటి టైమ్ లో మరే పెద్ద సినిమా వచ్చినా దానికి రావలిసిన కలెక్షన్లు రావడం చాలా కష్టం. అట్లాంటప్పుడు బాబు బాగా బిజీ అనే శృంగార కామెడి ఈ రోజు వస్తోంది. పైగా పబ్లిసిటీ లేకుండా వస్తున్న ఈ సినిమాకు సీన్ ఎలా వర్కవుట్ అవుతుందంటారు?

బాహుబలి 2 ఆడుతున్న ఏ థియేటర్ కు వెళ్ళి చూసినా కనిపిస్తున్న ఒకే బోర్డు హౌస్ ఫుల్. మరి ఇప్పుడు బాబు బాగా బిజీ ప్రేక్షకులును ఎలా తమ వైపు తిప్పుకుంటారంటే.. ఈ సినిమా ప్రొడ్యూసర్ అభిషేక్ ఇప్పటికే డిస్ట్రిబూటర్లతో మాటలాడి 300 థియేటర్లు తీసుకున్నారట. ఆల్రెడీ 300 ధియేటర్లు సైడ్ చేశారు కాబట్టి.. బాహుబలి 2 టికెట్లు దొరకని వారు ఈ పక్కకు వచ్చేస్తారని వీళ్ళ ఫీలింగ్. ధియేటర్లకు వచ్చే యువతకి ఈ శృంగార కామెడి బాగా నచ్చుతుంది అనే నమ్మకం ఉందంట.

ఇప్పటివరకు ఇలాంటి ప్లానింగ్ తో అనేక సినిమాలు వచ్చాయ్. చాలావరకు ఢమాల్ అనేశాయ్. కేవలం శృంగారభరితమైన సీన్ల మీద ఆధారపడి సినిమాను ఆడిచ్చేద్దాం అనుకుంటే వర్కవుట్ కాదు.

,  ,  ,  ,  ,