Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Jul-2016 17:56:53
facebook Twitter Googleplus
Photo

విక్టరీ వెంకటేష్, ?భలే భలే మగాడివోయ్‌?తో టాప్ దర్శకుల జాబితాలో చేరిపోయిన మారుతిల కాంబినేషన్‌లో ?బాబు బంగారం? అనే సినిమా విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. టీజర్‌తో విపరీతమైన అంచనాలను రేకెత్తించిన ఈ సినిమా జూలై 29న విడుదల కానుందని దర్శక, నిర్మాతలు కొద్దిరోజుల క్రితమే ప్రకటించేశారు. ఆ ప్లాన్ ప్రకారంగానే ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తి చేసిన టీమ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేసింది.
అయితే గత రెండు, మూడు రోజులుగా ?బాబు బంగారం? సినిమా వాయిదా పడనుందని కొన్ని వార్తలు వినిపించాయి. ఇక ఈ వార్తలన్నీ పుకార్లేనని టీమ్ స్పష్టం చేసింది. అనుకున్న ప్రకారంగానే ఈ నెలాఖర్లో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని, షూటింగ్ దాదాపుగా పూర్తైందని టీమ్ తెలిపింది. వెంకటేష్ సరసన నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. వెంకటేష్ ఈ సినిమాలో ఓ కామెడీ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు.

,  ,  ,  ,  ,  ,  ,