Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Jan-2016 14:42:55
facebook Twitter Googleplus
Photo

లెజెండ్.. జగపతి బాబు కెరీర్ ను గొప్ప మలుపు తిప్పిన మాట వాస్తవమే కానీ.. అతడిలో మంచి క్యారెక్టర్ నటుడు ఉన్నాడని ప్రూవ్ చేసిన సినిమా మాత్రం ?అనుకోకుండా ఒకరోజు?నే అని చెప్పాలి. ఆ సినిమాలో ఓ స్పెషల్ క్యారెక్టర్ చేసి.. తన ప్రత్యేకతను చూపించాడు జగపతి. ఇప్పటికీ ఆ సినిమా చూసినా.. అందులో ఆయన పాత్ర గుర్తొచ్చినా జనాలకు మంచి ఫీలింగ్ కలుగుతుంది. జగపతి విలన్ క్యారెక్టర్ వేసే సాహసం చేయడానికి ఒకరకంగా ఆ పాత్ర స్ఫూర్తి ఇచ్చిందని చెప్పాలి. జగపతికి అప్పుడంత మంచి పాత్ర ఇచ్చిన విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి.. మరోసారి ఆయన కోసం ఓ స్పెషల్ క్యారెక్టర్ ఏదైనా డిజైన్ చేశాడా అని సందేహం కలుగుతోంది ట్విట్టర్లో జగపతి బాబు షేర్ చేసిన ఓ ఫొటో చూస్తే.

?సాహసం? తర్వాత బాగా గ్యాప్ తీసుకున్న యేలేటి.. మోహన్ లాల్ గౌతమి ఇర్ఫాన్ ఖాన్ లాంటి విలక్షణ నటీనటులతో ఓ సినిమాకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం సైలెంటుగా షూటింగ్ జరుపుకుంటోంది. ఐతే సినిమాలో జగపతి బాబు కూడా నటిస్తున్నట్లు ఇప్పటికైతే సమాచారం లేదు. ఐతే మోహన్ లాల్ యేలేటిలతో కలిసి దిగిన ఫొటోను జగపతి షేర్ చేశాడు. ఈ సినిమాతో ఏ సంబంధం లేకుండా ఆ షూటింగ్ స్పాట్ కు అతను ఎందుకు వెళ్లి ఉంటాడన్నది సందేహం. బహుశా జగపతి కూడా అందులో ఓ క్యారెక్టర్ చేస్తున్నాడేమో. అదే నిజమైతే ఈ ప్రాజెక్టుకు మరింత క్రేజ్ రావడం ఖాయం.

,  ,  ,