Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Jun-2016 10:52:59
facebook Twitter Googleplus
Photo

సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన ?కబాలి? సినిమా ప్రస్తుతం సౌతిండియాలో హాట్ టాపిక్ అన్న విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. జూలై నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై అంచనాలన్నీ తారాస్థాయిలో ఉన్నాయి. ఇక ?కబాలి? టీమ్ కూడా సినిమాపై అంచనాలను అంతకంతకూ పెంచేస్తూ ప్రమోషన్స్‌లో కొత్త పుంతలు తొక్కుతోంది. ఏకంగా విమానాలపైనే ?కబాలి? పోస్టర్స్‌ను ముద్రించి, ఏయిర్ ఏషియాతో ప్రమోషన్స్ కోసం టీమ్ చేసుకున్న ఒప్పందం అందరినీ ఆకర్షిస్తోంది.
ఇక ఈ ప్రమోషన్స్‌ను మరింత ముందుకు తీసుకెళుతూ ఏయిర్ ఏషియా ఇండియా సంస్థ కొన్ని ప్రత్యేక ఆఫర్స్‌ను కూడా ప్రవేశపెట్టడం విశేషంగా చెప్పుకోవాలి. ?ఫ్లై లైక్ ఏ సూపర్ స్టార్? అన్న కాన్సెప్ట్‌తో ఏయిర్ ఏషియా జూలై 3వరకూ ఆన్‌లైన్లో కొన్ని ప్రత్యేక బుకింగ్స్‌ను ఓపెన్ చేసింది. చాలా తక్కువ ధరకే వచ్చేలా ఈ బుకింగ్స్‌లో కొన్ని ఆఫర్స్ ఉండడం మరో విశేషం. ఇలా ఇండియన్ సినిమాలో ఇప్పటివరకూ చేపట్టని తరహా ప్రమోషన్స్‌తో కబాలి అంతటా సెన్సేషన్‌గా మారిపోయింది. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను కళైపులి థాను నిర్మించారు.

,  ,  ,  ,  ,  ,  ,  ,