Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Oct-2016 16:36:46
facebook Twitter Googleplus
Photo

బాహుబలి ది కంక్లూజన్ పై ఉన్నంత ఆసక్తి.. టాలీవుడ్ లో మరే చిత్రంపైనా లేదు. బాహుబలితో టాలీవుడ్ సినిమాని.. ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీస్ లిస్ట్ లో చేర్చిన రాజమౌళి.. రెండో భాగంతో తిరుగులేని రికార్డులపై కన్నేశాడు. ఇప్పటికే ఈ సినిమా రైట్స్ విషయంలో కనీ వినీ ఎరగని డీల్స్ జరుగుతున్నాయి. అయితే.. ఓవర్సీస్ రైట్స్ కి సంబంధించి ఇప్పటికే ఓ అగ్రిమెంట్ కుదరగా.. ఇప్పుడు మళ్లీ ఓవర్సీస్ హక్కులను వెనక్కు తీసేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.

కె ఎంటర్టెయిన్మెంట్ రాజా రత్నంకు 87 కోట్ల భారీ మొత్తంతో ఓ డీల్ కుదుర్చుకుంది బాహుబలి యూనిట్. శాటిలైట్ మినహా తమిళ్ థియేట్రికల్ రైట్స్ ప్లస్ తెలుగు-తమిళ్-మలయాళం ఓవర్సీస్ హక్కులు ఇవ్వగా.. అంచనాలకు తగ్గట్లుగా రిలీజ్ చేయగలగడంపై అనుమానాలు బయల్దేరాయట. అందుకే తమిళ్ థియేట్రికల్ రైట్స్ మినహాయిస్తే.. మూడు భాషల యూఎస్ ఏ-కెనడాలకు సంబంధించిన ఓవర్సీర్ రైట్స్ ను ఆర్కామీడియా తరఫున మళ్లీ వెనక్కి తీసేసుకున్నారని అంటున్నారు.

ఇప్పటికీ బాహుబలి ది కంక్లూజన్ కు ఓవర్సీస్ నుంచి పెద్ద మొత్తానికే డిమాండ్స్ వస్తున్నాయ్ కానీ.. ఈ ఏరియా కలెక్షన్స్ విషయంలో నిర్మాతల కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువగా ఉంది. అందుకే ఓన్ రిలీజ్ కి ప్లాన్ చేసేసుకుంటున్నట్లు టాక్.

,  ,  ,  ,  ,  ,