Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Apr-2017 09:57:55
facebook Twitter Googleplus
Photo

ఎప్పుడో 2014లో రిలీజైన సినిమా క్వీన్. ఆ చిత్రాన్ని రీమేక్ చేయాలని తహతహలాడిపోయాడు తమిళ నటుడు.. నిర్మాత త్యాగరాజన్. రెండేళ్ల కిందటే రీమేక్ రైట్స్ తీసుకుని అప్పట్నుంచి సన్నాహాలు చేస్తూ...నే ఉన్నాడు. ఐతే ఈ మధ్యే వ్యవహారం ఓ కొలిక్కి వచ్చి.. తమన్నా కథానాయికగా తమిళ తెలుగు భాషల్లో సినిమాను పునర్నిర్మించబోతున్నట్లు ప్రకటించాడు. కానీ ఆ ప్రకటన తర్వాత ఏ అప్ డేట్ లేదు. ఈ మధ్య ఉన్నట్లుండి ఈ సినిమా క్యాన్సిల్ అయినట్లుగా వార్తలొచ్చాయి. స్వయంగా త్యాగరాజనే ఇప్పుడు ఈ సినిమాను ఆపేస్తున్నట్లు చెప్పాడు. అందుకే కారణమేంటో కూడా వెల్లడించాడు.

తమన్నా పారితోషకం చాలా ఎక్కువ డిమాండ్ చేయడమే క్వీన్ రీమేక్ ఆగిపోవడానికి కారణమని త్యాగరాజన్ చెప్పడం విశేషం. తమన్నా అడిగినంత ఇస్తే ఈ ప్రాజెక్టు వయబుల్ కాదని.. అందుకే ఆమెతో ఈ సినిమాను తెరకెక్కించలేక వెనక్కి తగ్గామని త్యాగరాజన్ చెప్పాడు. ప్రస్తుతానికి ఈ సినిమాను ఆపేస్తున్నామని.. సరైన హీరోయిన్ దొరికితే భవిష్యత్తులో మళ్లీ ప్రాజెక్టును పున:ప్రారంభించే అవకాశాలున్నాయని అతను చెప్పాడు. తమన్నా లాంటి స్టార్ హీరోయిన్ రెండు భాషల్లోనూ ఓ సినిమాలో లీడ్ రోల్ చేయాలంటే కొంచెం ఎక్కువే డిమాండ్ చేసి ఉంటుంది. బాహుబలి తర్వాత ఆమె రేంజ్ పెరిగింది

,  ,  ,  ,  ,  ,