Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Aug-2016 14:02:21
facebook Twitter Googleplus
Photo

అప్పుడే బాహుబ‌లి-2 మోత మొదలైంది. ప్రీ రిలీజ్ బిజినెస్ జోరుగా జరుగుతోంది. ఇప్పటికే తమిళ్ రైట్స్ రూ.54 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ రూ. 37కోట్లకి అమ్ముడుపోయాయి. ఇక, శాటిలైట్ కి ఊహించిన రేంజ్ లో డిమాండ్ ఏర్పడింది. బాహుబలి క్రియేట్ చేసిన సంచలనాల దృష్ట్యా బాహుబలి 2 దాదాపు రూ.1000 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్లు రాబ‌డుతుంద‌ని జాతీయ మీడియా లెక్క‌లు వేస్తోంది.

అంచనాలకి తగ్గట్టుగా దర్శకుడు రాజమౌళి ప్రమోషన్స్ ని ప్లాన్ చేస్తున్నాడు. ఇటీవలే కరణ్ జోహార్ తో కలసి పార్టు 2 ప్రమోషన్స్ పై విస్తృతంగా చర్చించారు. అంతర్జాతీయంగా బాహుబలి2కి క్రేజ్ రావడానికి ఒలంపిక్స్ ని కూడా వాడుకొన్న విషయం తెలిసిందే. అయితే, ఈలోపు పార్టు2కి సంబంధించిన ఏ చిన్న వీడియో గానీ, ట్విస్ట్ గానీ లీక్ కాకుండా పకడ్భందీగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు జక్కన్న.

ప్రస్తుతం చిత్రీకరిస్తున్న కీలక సన్నివేశాలకు ఈగని కూడా వాలకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే.. మనోడు, మంది అనే తేడానే లేదు. ఎవ్వరినీ నమ్మడం లేదు. సినిమాలోని ?కీ? సీన్లని చిత్రీకరించేటప్పుడు ఎవరినీ దగ్గరకు రానివ్వటం లేదు. కెమెరామెన్ సెంథిల్, రాజమౌళి?ఆ సీన్ లో ఉండాల్సిన నటీ నటులు తప్ప మరెవ్వరూ అక్కడ అడుగు పెట్టటానికి వీల్లేదంటూ ఆఙ్ఞలు జారీ చేశాడు.

ఎందుకంటే.. పార్టు2లోని కీలక సీన్స్ గానీ, ట్విస్ట్ లు గానీ లీకైతే ఆ మొత్తం ప్రభావం సినిమాపై పడుతోంది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో ముందే తెలిసిందే.. సినిమా చూసేందుకు జనాలు ఎందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. అందుకే.. ఎలాంటి కీ సీన్స్ లీక్ కాకుండా జాగ్రత్త పడుతున్నాడు జక్కన్న.

,  ,  ,  ,  ,  ,