Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Jul-2016 11:53:05
facebook Twitter Googleplus
Photo

ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా స్టామినాను చాటిచెప్పిన చిత్రం ?బాహుబలి?. దర్శక ధీరుడు ?ఎస్.ఎస్. రాజమౌళి? తెరకెక్కించిన ఈ అద్భుతం ఇప్పటికే పలు రికార్డుల్ని బద్దలుకొట్టిన సంగతి తెలిసిందే. అయితే కొన్నిరోజుల క్రితం విడుదలైన ?రజనీకాంత్? నటించిన ?కబాలి? చిత్రం పలు బాహుబలి రికార్డుల్ని తుడిచిపెట్టేసింది. వాటిలో ఇతర రాష్ట్రాలు కొనుకున్న మూవీ రైట్స్ కూడా ఉన్నాయి.
కబాలి కేరళలో రైట్స్ గత బాహుబలి ? ది బిగినింగ్ రికార్డుల్ని తిరగరాస్తూ రూ.7. 5 కోట్లకు అమ్ముడయ్యాయి. మళ్ళీ ఇప్పుడు తాజాగా ?బాహుబలి ? ది కన్ క్లూజన్? కేరళ హక్కులు కబాలి రికార్డుల్ని బద్దలు కొడుతూ రూ.10.5 కోట్ల భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని సమాచారం. బాహుబలి మొదటి పార్ట్ సూపర్ సక్సెస్ సాధించడంతో దీని సీక్వెల్ బాహుబలి ? ది కన్ క్లూజన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2017 ఏప్రిల్ లో విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు.

,  ,  ,  ,  ,