Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Aug-2016 13:24:38
facebook Twitter Googleplus
Photo

బాహుబలి టీం క్రికెట్ ఆడటం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా..మీరు చూసింది నిజమేనండి..కాకపోతే ఎందుకు ఆడుతున్నారో తెలుసుకోవాలంటే అసలు స్టోరీ చూడాల్సిందే.

తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచ నలుమూలల తెలిసేలా బాహుబ‌లి ది బిగినింగ్ చిత్రాన్ని తెరకెక్కించాడు రాజమౌళి. ఇప్పుడు బాహుబలి- ది కన్‌క్లూజన్ ను తెరకెక్కించే పనిలో బిజీ అయ్యాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబదించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే క్లైమాక్స్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ , ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో క్రికెట్ ఆడుతూ టైం పాస్ చేస్తున్నారు.నిన్న చివరి యుద్ధ సన్నివేశాల తీయడానికి రెడీ కాగా సడెన్ గా హైదరాబాద్ లో భారీ వర్షం కురవడం తో షూటింగ్ స్పాట్ మొత్తం నీటితో నిండిపోయి షూటింగ్ కు అంతరాయం ఏర్పడిందని, దీంతో యూనిట్ అంత తడిసిన షూటింగ్ స్పాట్ ను క్రికెట్ ఆడుకోవడానికి వాడుకుంటున్నారు? అంటూ రాజమౌళి ట్వీట్ చేసాడు, దాంతో పాటు వాళ్ళు క్రికెట్ ఆడే వీడియోను కూడా పోస్ట్ చేసాడు.

ఇకపోతే ఈ చిత్రాన్ని 2017 ఏప్రిల్ 28న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

,  ,  ,  ,