Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Aug-2017 11:34:49
facebook Twitter Googleplus
Photo

శాతకర్ణి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఒక కొత్త తరహాలో వస్తున్నాడు బాలకృష్ణ. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన పైసా వసూల్ అనే సినిమా సెప్టెంబర్1 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే టీజర్స్ - ట్రైలర్స్ తో సినిమాపై ఆసక్తిని రేపిన బాలయ్య ప్రస్తుతం సినిమాలోని సాంగ్ ప్రోమోలతో బాగానే హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

రీసెంట్ గా యుట్యూబ్ లో ఒక సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. అందులో నందమూరి తారకరామారావు అలనాటి చిత్రం "జీవిత చక్రం" లొని కొంటే నవ్వు పాటను రీమిక్స్ చేశారు. ఎన్టీఆర్ - వాణిశ్రీ అప్పట్లో పాటలో ఎంతగా అలరించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికి ఆ పాట చాలా ఫెమాస్. అయితే అలాంటి పాటను బాలయ్య తన సినిమాల్లో వాడేసుకున్నాడు. బాలయ్య మొదటిసారి చేసిన ఈ ప్రయోగం ఎలా ఉంది అంటే.. మిక్సుడ్ టాక్ వినిపిస్తోంది. తండ్రిని ఇమిటేట్ చేస్తూ బాలయ్య చూపించిన హవా భావాలు సుపర్బ్ గా ఉన్నాయి కాని.. ఒక్కోసారి మాత్రం ఏదో సీనియర్ ఎన్టీఆర్ ను వెటకారం చేసినట్లున్నాయ్ బాలయ్య స్టెప్స్. పాటను రీమిక్స్ చేస్తే సరిపోయేది కాని.. ఇలా ఎన్టీఆర్ డ్యాన్సులను కూడా రీమిక్స్ చేసి దించాల్సిన అవసరం ఏముందనేది జనాల క్వశ్చన్. అప్పటి పాటలో ఉన్న కాస్ట్యూమ్స్ ఉన్న విధంగానే ఈ రీమిక్స్ పాటలో కూడా అదే వింటేజ్ లుక్ తో బాలయ్య అండ్ ముస్కాన్ సేతి కనిపించడం ఒక కొసమెరుపు.

అనుప్ రూబెన్స్ స్వరపచిన ఈ పాటను సీనియర్ గాయకుడు మనో పాడారు. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రియ.. ముస్కాన్ సేతి తో పాటు కైరా దత్ నటిస్తోంది.

,  ,  ,  ,  ,