Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Sep-2015 17:26:15
facebook Twitter Googleplus
Photo

అక్కినేని అభిమానులు ఎంతో ఎగ్జయిట్ మెంట్ తో ఉన్న సందర్భమిది. నాగార్జున వారసుడు అఖిల్ రాకకు ఇంకెంతో సమయం లేదు. అక్టోబర్ 22 రిలీజ్ తేదీ ప్రకటించేశారు. అఖిల్ టాలీవుడ్ లో స్టార్ హీరో స్టాటస్ తో వెలిగిపోతాడని ముందస్తు అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. అక్కినేని లెగసీని కాపాడే రియల్ హీరో అఖిల్ రూపంలో వస్తున్నాడు అన్నదే ఇండస్ర్టీ టాక్. అందుకు తగ్గట్టే అఖిల్ మొదటి సినిమా ట్రైలర్ అతడి రేంజుని ఆవిష్కరించింది. ఆడియో వేడుక ఓ రేంజులో సాగింది. సినిమా రిలీజ్ కి ముందే అసాధారణమైన బిజినెస్ జరగడం డిష్కసన్ పాయింట్ అయ్యింది. ఏ కోణంలో చూసినా అఖిల్ మొదటి సినిమా రిలీజ్ కాకముందే సూపర్ స్టార్ అన్న పేరు కొట్టేశాడు.

అయితే అఖిల్ అక్కినేని లెగసీని నిలబెట్టేందుకు ఎక్కడా అలసత్వం అన్నదే లేకుండా తనవంతు తీవ్రంగా కృషి చేస్తున్నాడు. ఓసారి సినిమా ప్రారంభం కాగానే ఇక పూర్తిగా పనికే అంకితమైపోయాడు. ఎక్కడా విరామం అన్నదే లేదు. అవిశ్రాంతంగా కష్టించాడు. రేయింబవళ్లు - ఎండా - వానా - చలి అనేదే లేకుండా పనిచేశాడు. ఆఫ్రికాలోని భూమధ్యరేఖ పరిసరాల్లో అత్యంత ఉష్ణోగ్రతని తట్టుకుని మరీ షూటింగు కోసం శ్రమించాడు. దేశ - విదేశాల్లో సంచారం చేసి వచ్చాడు. ఈ ఏడాది కాలంలో అతడికి విరామం అన్నదే లేదు.

ఇప్పుడు అన్నపూర్ణ ఏడెకరాల్లో వేసిన సెట్ లో ఇంట్రడక్షన్ సాంగ్ షూట్ పూర్తి చేసుకున్నాడు. ఇలా సాంగ్ షూట్ అయ్యిందో లేదో అతడు వెంటనే అమెరికా వెళ్లి అక్కడ తన సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. క్షణం తీరిక లేకుండా ఈ రేంజులో ఓ స్టార్ తనయుడు కష్టించడం అంటే ఆషామాషీ కాదు. అఖిల్ తాత పేరు తండ్రి పేరు నిలబెడతాడు అనడంలో సందేహం లేదు.

,  ,  ,  ,