Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Feb-2017 11:16:14
facebook Twitter Googleplus
Photo

తమిళ సీనియర్ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య 101వ సినిమా కన్ఫమ్ అంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జనగణమన చేస్తాడంటున్నారు. పూరి డైరెక్షన్లో సినిమా అనే వార్త కొంచెం లేటుగా బయటికి వచ్చింది. ఐతే పూరి-బాలయ్య కాంబో మీద ఎవరికీ నమ్మకాల్లేవు.

తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి క్రిష్ తో శాతకర్ణి చేసినప్పటికీ.. ఫ్లాపుల్లో కొట్టుమిట్టాడుతున్న.. పైగా రొటీన్ సినిమాలే చేస్తూ వస్తున్న పూరితో బాలయ్య ఇప్పుడు జోడీ కడతాడా అన్నది సందేహమే. కాబట్టి కె.ఎస్.రవికుమార్ తోనే బాలయ్య సినిమా కన్ఫమ్ అవుతుందని భావిస్తున్నారు నందమూరి అభిమానులు. ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు టైటిల్ కూడా ఫిక్సయినట్లుగా వార్తలు వస్తుండటం విశేషం.

బాలయ్య-కె.ఎస్ సినిమాకు జయసింహా.. రెడ్డిగారు అనే రెండు టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయట. బాలయ్యకు సింహా అని పదం బాగా కలిసొచ్చింది. బొబ్బిలి సింహం.. సమరసింహారెడ్డి.. నరసింహ నాయుడు.. సింహా లాంటి సూపర్ హిట్లు కొట్టిన నేపథ్యంలో సింహా అనే పదం ఆయనకు సెంటిమెంటుగా మారింది. కాబట్టి జయసింహా మీద బాలయ్య ఆసక్తి చూపించే అవకాశముంది. ఇక రెడ్డి గారు అనే టైటిల్ ఆసక్తికరంగా.. క్యాచీగా అనిపిస్తోంది. మరి నిజంగా బాలయ్య-కె.ఎస్ రవికుమార్ సినిమా కన్ఫమ్ అయినట్లయితే ఈ రెండు టైటిళ్లలో ఏది ఫిక్సవుతుందో చూడాలి.

,  ,  ,  ,  ,  ,