Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Nov-2017 14:48:43
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ లో రీమేక్ చేయడంలో.. సీనియర్ హీరో వెంకటేష్ కు బోలెడంత గుర్తింపు ఉంది. స్ట్రెయిట్ సినిమాలను చేస్తూనే.. రీమేక్స్ కు అంతే సమానంగా ఇంపార్టెన్స్ ఇస్తాడు వెంకీ. రీసెంట్ టైంలో గోపాలా.. దృశ్యం.. గురు వంటి సినిమాలన్నీ రీమేక్ లే.

కొన్ని నెలలుగా సినిమాల ఒప్పుకోవడంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు వెంకటేష్. ముందుగా అనుకున్న ప్రాజెక్టులను రద్దు చేసుకున్నాడు కూడా. ఎట్టకేలకు.. తేజ దర్శకత్వంలో ఓ పొలిటికల్ యాంగిల్ లో తెరకెక్కే సినిమాకు సై అన్నట్లుగా చెబుతుండగా.. డిసెంబర్ లో వెంకీ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం స్టార్ట్ కానుంది. అయితే.. ఇప్పుడు వెంకీ మరో రీమేక్ ను చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రీసెంట్ గా వెంకటేష్ ఓ మలయాళ మూవీ చూశాడట. మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన 'ద గ్రేట్ ఫాదర్' మూవీని స్పెషల్ స్క్రీనింగ్ వేయించుకుని మరీ చూశాడట వెంకటేష్. ఈ సినిమాలో ఉన్న కంటెంట్.. సోషల్ మెసేజ్ బేస్డ్ గా తీసిన విధానం వెంకీని విపరీతంగా ఆకట్టుకున్నాయని తెలుస్తోంది.

మమ్ముట్టి చేసిన రోల్ ను చేసేందుకు వెంకటేష్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని అంటున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి.. రీమేక్ హక్కుల కోసం ప్రయత్నాలు మొదలైనట్లు టాక్. మలయాళంలో 30 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచిన ది గ్రేట్ ఫాదర్ మూవీ.. తెలుగు జనాలను కూడా బాగా ఆకట్టుకుంటుందని వెంకీ ఆశిస్తున్నాడు.

,  ,  ,  ,  ,