Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Jul-2017 10:37:03
facebook Twitter Googleplus
Photo

బాలకృష్ణ వరుస సినిమాలతో కుర్ర హీరోలకి పోటీ ఇస్తున్నాడు. ఇప్పటికే ఈ ఏడాది తన 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణితో నందమూరి అభిమానుల్ని మెప్పించిన బాలయ్య ఆ వెంటనే పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో నటించేందుకు అంగీకరించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆ వేడి తగ్గక ముందే పూరీ ఈ ప్రాజెక్ట్ కి పైసా వసూల్ అని పేరు పెట్టేయడం అంతే వేగంగా షూటింగ్ ను దాదాపు చివరి దశకి తీసుకురావడం జరిగిపోయాయి. ప్రస్తుతం బాలయ్య పైసా వసూల్ కి డబ్బింగ్ చెబుతున్నాడని సమాచారం.

అయితే పైసా వసూల్ ఇంకా ఓ కొలిక్కి రాకుండానే బాలయ్య 102వ సినిమాకి సంబంధించిన వార్తలు ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో షికార్లు చేస్తున్నాయి. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ - బాలకృష్ణ హీరోగా ఓ సినిమా నిర్మించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా ఓపినింగ్ ఆగస్ట్ 3న ఖరారైనట్లు తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

,  ,  ,  ,  ,