Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Nov-2014 10:54:46
facebook Twitter Googleplus
Photo

తెలుగులో భారీ విజయం సాధించిన 'మగధీర' బాలీవుడ్ లో రీమేక్ అవడానికి సిద్ధమవుతోంది. ప్రముఖ దర్శక, నిర్మాత సాజిద్ నడియడ్ వాలా ఈ చిత్రాన్ని హిందీలో రూపొందించబోతున్నారు. రామ్ చరణ్ పాత్రను హీరో షాహిద్ కపూర్ చేయనున్నాడు. కొంతకాలంగా ఈ సినిమాను హిందీలో పునర్ నిర్మించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా దర్శక నిర్మాత దీనిని మీడియాకు ధ్రువీకరించాడు. "అవును, మగధీర రీమేక్ రైట్స్ నేను తీసుకున్నాను. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు వర్క్ మొదలుపెడతాం. ఆ ఏడాది చివరిలో చిత్రీకరణ మొదలయ్యే అవకాశం ఉంది. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తాడు" అని సాజిద్ తెలిపాడు.

,  ,  ,  ,