Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Nov-2016 10:45:52
facebook Twitter Googleplus
Photo

బాలయ్య కథ ముగిసిందంటే మరోలా అనుకోకండి. బాలయ్య కెరీర్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న గౌతమీపుత్ర శాతకర్ణి విషయంలో ఆయన పని ముగిసింది. ఈ సినిమా షూటింగ్ కు తెరపడింది. టాకీ పార్ట్ ఇప్పటికే పూర్తి కాగా.. రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించిన చివరి పాటతో షూటింగ్ మొత్తం అవగొట్టేశాడు క్రిష్. బాలయ్య-శ్రియల మీద ఒక రొమాంటిక్ సాంగ్ ను బృంద మాస్టర్ నేతృత్వంలో చిత్రీకరించాడు క్రిష్. మూడు రోజుల వ్యవధిలోనే ఈ పాట పూర్తయినట్లు సమాచారం. దీంతో షూటింగ్ పార్ట్ అంతా అయిపోయింది. ఓవైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని కూడా పర్యవేక్షిస్తున్నాడు క్రిష్. ఆ పని సమాంతరంగా సాగుతోంది.

మొదట్నుంచి పక్కా ప్లాన్ తో సాగుతున్న క్రిష్ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికే రిలీజ్ చేయాలన్న పట్టుదలతో ఉన్నాడు. యుద్ధ సన్నివేశాలకు సంబంధించి భారీ ఖర్చుతో గ్రాఫిక్స్.. విజువల్ ఎఫెక్ట్స్ జోడిస్తున్నారు. ఫేమస్ టెక్నీషియన్ ఆధ్వర్యంలో ఆ పని నడుస్తోంది. అంతా అనుకున్న ప్రకారమే జరుగుతుండటంతో సినిమా సంక్రాంతికి రావడం పక్కా అని సమాచారం. డిసెంబరు 9న ?గౌతమీ పుత్ర శాతకర్ణి? ట్రైలర్ ను ప్రపంచవ్యాప్తంగా వంద థియేటర్లలో ఒకేసారి లాంచ్ చేయబోతున్నారు. 16న ఆడియో విడుదలవుతుంది. ఆ తర్వాత ప్రమోషన్లు భారీ స్థాయిలో చేసి సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేనున్నారు. ఈ చిత్రాన్ని క్రిష్ తన సొంత బేనర్లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

,  ,  ,  ,  ,