Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Jun-2016 12:51:51
facebook Twitter Googleplus
Photo

సినిమాలకి దూరంగా రాజకీయ వ్యవహారాలతో బిజీ బిజీగా గడుపుతున్న సమయంలోనూ చిరంజీవి తరచుగా సినిమా వేడుకలకి హాజరయ్యేవారు. ఇక్కడికొస్తే అదో ఆనందం అంటూ వేదికలపై మాట్లాడేవారు. అలాంటి చిరంజీవి ఇక సినిమాల్లోఇక రీ ఎంట్రీ ఇచ్చాక ఎందుకు మాత్రం ఫిల్మ్ ఫంక్షన్స్ కి దూరమవుతారు? అందుకే సింగపూర్ లో జరిగే సైమా వేడుకకి రమ్మని ఆహ్వానించగానే డన్ అంటూ తన అంగీకారం తెలిపారు.

ఈ నెల 30న - వచ్చే నెల 1న రెండు రోజులపాటు జరగనున్న సైమా వేడుకలో దక్షిణాది పరిశ్రమలన్నీ పాల్గొంటున్నాయి. ప్రతీ యేటా భారీ స్థాయిలో జరిగే ఈ వేడుకకి ఈసారి చిరు హాజరవుతండటంతో మరింత క్రేజ్ మొదలైంది. జూన్ 30లోపు చిరంజీవి కొత్త సినిమా మొదలయ్యుంటుంది అయినప్పటికీ తాను వేడుకకి వస్తానని చెప్పారంటే ఆయన ఆసక్తిని గమనించొచ్చు. దక్షిణాదికి చెందిన తోటి తారలంతా పాల్గొంటారు కాబట్టి తన రీ ఎంట్రీకి అదొక గ్రాండ్ వెల్కమ్ లా ఆ వేడుక ఉంటుందని చిరు భావిస్తున్నారు.

మెగా కుటుంబం నుంచి చిరుతో పాటు - అల్లు అర్జున్ - అల్లు శిరీష్ లు కూడా సైమాలో పాల్గొనే అవకాశాలున్నాయి. చరణ్ - సాయిదరమ్ తేజ్ - వరుణ్ తేజ్ లు మాత్రం తమ తమ షూటింగ్ లతో బిజీ అవ్వబోతున్నారు.

,  ,  ,  ,  ,  ,  ,