Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-May-2016 19:10:18
facebook Twitter Googleplus
Photo

నందమూరి బాలకృష్ణ వయసు 55 ఏళ్లు. ఈ వయసులో ఎవరికైనా ఓపిక తక్కువగానే ఉంటుంది. మరీ ఎక్కువ కష్టపడ్డానికి శరీరం సహకరించదు. ఐతే బాలయ్య మాత్రం తన వందో సినిమా కోసం విపరీతంగా శ్రమిస్తున్నాడట. రోజుకు 11 గంటల పాటు ఆయన చెమటోడుస్తున్నట్లు సమాచారం. ?గౌతమీ పుత్ర శాతకర్ణి? షూటింగ్ నాలుగు రోజుల కిందట మొరాకోలో ఆరంభమైన సంగతి తెలిసిందే. ఆరంభం ఆరంభమే భారీ స్థాయిలో వార్ సీక్వెన్స్ తీస్తున్నాడు క్రిష్. వందల మందిని ఇక్కడి నుంచి తీసుకెళ్లి యుద్ధ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు. ఎంతో శ్రమ.. ఖర్చుతో కూడుకున్న సన్నివేశాలివి. ఈ ఎపిసోడ్ కోసం రూ.8 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఐతే వర్కింగ్ డేస్ మరీ ఎక్కువైతే ఖర్చు మరింతగా పెరిగే అవకాశముంది.

ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఈ ఎపిసోడ్ చిత్రీకరణ పూర్తి చేయడం కోసం క్రిష్ అండ్ కో రేయింబవళ్లు శ్రమిస్తున్నారట. ఉదయం నుంచి రాత్రి వరకు చిత్రీకరణ సాగుతోందట. బాలయ్య రోజుకు 11 గంటల పాటు షూటింగులో పాల్గొంటున్నాడట. రామ్-లక్ష్మణ్ ఆధ్వర్యంలో హాలీవుడ్ ఫైటర్ల సాయంతో ఈ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. మూడు వారాలు నిర్విరామంగా ఈ సన్నివేశాల చిత్రీకరణ సాగనుంది. సినిమాకు ఈ ఎపిసోడ్ అత్యంత కీలకమైందిగా చెబుతున్నారు.

ఈ ఎపిసోడ్ పూర్తి చేసుకుని హైదరాబాద్ కు వచ్చాక.. చిలుకూరు దగ్గర సిద్ధమవుతున్న రాజప్రసాదం సెట్లో చిత్రీకరణ జరుగుతుంది. జూన్ 10న బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ?గౌతమీపుత్ర శాతకర్ణి? ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయాలని చూస్తున్నాడు క్రిష్. వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది.

,  ,  ,  ,  ,  ,