Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Apr-2016 12:54:28
facebook Twitter Googleplus
Photo

ఏడెనిమిదేళ్ల పాటు తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది త్రిష. ఐతే ఆమె మంచి రేంజిలో ఉండగా.. సీనియర్ స్టార్ హీరోలు అందరితో నటించింది కానీ.. ఒక్క బాలయ్యతో మాత్రం సినిమా చేయలేదు. ఐతే ఆమె బాగా ఫేడవుట్ అయిపోయాక.. స్టార్ హీరోలు పట్టించుకోవడం మానేశాక గత ఏడాది ?లయన్? సినిమాలో త్రిషకు ఛాన్సిచ్చాడు బాలయ్య. కానీ త్రిష మాత్రం బాలయ్య మంచిని గుర్తు పెట్టుకోలేదు. తాను చేసే ప్రతి సినిమా గురించి ట్విట్టర్లో ఊదరగొట్టేసే త్రిష.. ?లయన్? సినిమాను మాత్రం పెద్దగా ప్రమోట్ చేసింది లేదు. ఏదో ఆ సినిమాలో నటించి తప్పు చేశా అన్నట్లు ఎప్పుడూ దాని ఊసే ఎత్తలేదు. రిలీజ్ కు ముందు.. తర్వాత ఇదే పరిస్థితి.

అలాంటి త్రిషకు సాయం చేయడానికి ఇప్పుడు బాలయ్య రాబోతున్నాడన్న వార్త ఆశ్చర్యం కలిగిస్తోంది. త్రిష ప్రధాన పాత్రలో తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ?నాయకి? ఆడియో వేడుకను ఈ నెల 19న హైదరాబాద్ లో చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి బాలయ్య ముఖ్య అతిథిగా వస్తాడని ప్రకటించారు. మరి బాలయ్య ఎవరి మీద అభిమానంతో ఒప్పుకున్నాడో కానీ.. తమ హీరోతో చేసిన సినిమాను ఏమాత్రం పట్టించుకోని హీరోయిన్ కు ఇంత విలువ ఎందుకిస్తున్నాడో అని బాలయ్య ఫ్యాన్స్ కొంచెం గుర్రుగానే ఉన్నారు. ఆ సంగతలా ఉంచితే.. కెరీర్ చరమాంకంలో ఉన్న త్రిషకు ఈ సినిమా చాలా కీలకం. ఆమె నటించిన ఫస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ ఇది. గోవి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సత్యం రాజేష్ హీరో తరహా పాత్ర పోషిస్తుండటం విశేషం.

,  ,  ,  ,  ,  ,  ,  ,