Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Apr-2015 10:23:56
facebook Twitter Googleplus
Photo

ఏ సినిమా విజయమైనా ప్రేక్షకులు ఆదరించడంపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే తమ సినిమా వివరాలు .. విశేషాలు ఎప్పటికప్పుడు వాళ్లకి చేరేలా దర్శక నిర్మాతలు చూస్తుంటారు. దాంతో సినిమా విడుదల సమయానికి ఆసక్తి .. అంచనాలు ఏర్పడుతుంటాయి. అలాంటి అంచనాలను అందుకున్న చిత్రంగా 'సన్నాఫ్ సత్యమూర్తి' కనిపిస్తుంది. ఆశించిన విజయాన్ని ఈ సినిమా అందుకుంది. అందువలన ఇంతటి సక్సెస్ ని అందించిన ప్రేక్షకులకు యూనిట్ సభ్యులంతా కలిసి కృతజ్ఞతలు చెప్పబోతున్నారు. 'థ్యాంక్స్ మీట్' పేరుతో ఈ నెల 23 న విశాఖలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టుగా చెబుతున్నారు. మొదట్లో ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ - శిల్పకళా వేదికలో జరపనున్నట్టు ప్రకటించారు. అనివార్య కారణాల వలన వాయిదాపడటంతో ఆ కార్యక్రమాన్ని ఇప్పుడిలా విశాఖలో నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు.

,  ,  ,  ,  ,