Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Jun-2017 13:00:06
facebook Twitter Googleplus
Photo

బాలకృష్ణ 100 సినిమాలు పూర్తి చేసి.. ఇప్పుడు 101వ సినిమాను చేసేస్తున్నారు. ఈ నెల 10న ఆయన పుట్టిన రోజు కూడా వస్తుండడంతో.. నందమూరి ఫ్యాన్స్ అప్పుడే హంగామా కూడా స్టార్ట్ చేసేశారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఈ సారి నందమూరి అభిమానులకు రెండు గిఫ్ట్ లు ప్లాన్ చేసుకున్నారు బాలకృష్ణ.

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ఫస్ట్ లుక్ ను ఇవ్వబోతున్నారు. జూన్ 9న రాత్రికి నందమూరి బాలకృష్ణ.. పూరీ జగన్నాధ్ లు ఫేస్ బుక్ పేజ్ లో ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నారు అంటూ నిర్మాణ సంస్థ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చింది. అదే రోజున ఫ్యాన్స్ తో లైవ్ ఛాట్ కూడా చేయనున్నారు బాలయ్య. ఇటు ఫస్ట్ లుక్ తో పాటు.. లైవ్ చాట్ చేసి.. తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు రెండు బహుమతులు ఇవ్వనున్నారు నందమూరి బాలకృష్ణ. ఫస్ట్ లుక్ తో పాటే టైటిల్ పై కూడా అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే నూతన ట్రెండ్ అయిన ఫేస్ బుక్ లైవ్ చాట్ వంటివి యంగ్ హీరోలు మాత్రమే చేస్తుంటారు. బాలయ్య వంటి సీనియర్ హీరోలు అలాంటి ఎప్పుడూ చేయలేదు. మరి అప్పుడప్పుడూ అభిమానులు కాస్త ఇబ్బందికరంగా బిహేవ్ చేసే ఈ లైవ్ చాట్ లో.. ఇప్పుడు బాలయ్య ఏం చెప్తాడో.. ఒకవేళ తిక్క ప్రశ్నలు ఎవరైనా అడిగితే ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో అంటూ చాలామంది ఆందోళనగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

,  ,  ,  ,  ,