Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Mar-2017 11:28:59
facebook Twitter Googleplus
Photo

అక్కినేని అఖిల్ హీరోగా అరంగేట్రం చేసిన మూవీ అఖిల్. తొలి సినిమాతో అక్కినేని అభిమానులను నిరుత్సాహపరచడమే కాదు.. తాను కూడా డీలా పడ్డాడు అఖిల్. అందుకే రెండో సినిమా ప్రారంభం కోసం ఏడాదిన్నర పైగా వెయిట్ చేయాల్సి వచ్చింది. అనేక మంది దర్శకులతో సంప్రదింపుల తర్వాత.. చివరకు విక్రమ్ కె కుమార్ దగ్గర ఈ సెర్చింగ్ ఆగింది.

త్వరలో అఖిల్ రెండో సినిమా ప్రారంభం కానుండగా.. ఇప్పుడీ మూవీకి టైటిల్ డిసైడ్ చేసేసినట్లు తెలుస్తోంది. పేరు దగ్గర నుంచి ప్రతీ విషయంలోను ఎంతో పర్ఫెక్ట్ గా ఉండే దర్శకుడు విక్రమ్ కె కుమార్. తన ప్రతీ చిత్రం మాదిరిగానే.. అఖిల్ తో చేయనున్న సినిమాకి కూడా.. ప్రారంభానికి ముందే టైటిల్ ఇచ్చేశాడట. రా రండోయ్.. వేడుక చూద్దాం అని పేరు పెట్టబోతున్నారని తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ మూవీ టైటిల్ బయటకు రావడానికి కారణం.. అక్కినేని నాగార్జునే కావడం విశేషం.

తాజాగా అన్నపూర్ణ బ్యానర్ పై.. 'రా రండోయ్ వేడుక చూద్దాం' టైటిల్ ను రిజిస్టర్ చేయించారు నాగార్జున. ప్రస్తుతం ఈ బ్యానర్ పై చర్చల్లో ఉన్న చిత్రం అఖిల్ మూవీ ఒక్కటే కావడంతో.. ఇది అఖిల్ రెండో సినిమా పేరే అని ఫిక్సయిపోయారు సినీ జనాలు. తనకు ఓ సినిమా విషయంలో ఎంత క్లారిటీ ఉంటుందో.. దర్శకుడు విక్రమ్ కె కుమార్ మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. టైటిల్ వినగానే.. ఇదో ఫ్యామిలీ డ్రామా అనే సంగతి తెలిసిపోవడం లేదూ

,  ,  ,  ,  ,  ,