Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Dec-2016 11:58:03
facebook Twitter Googleplus
Photo

రెండు దశాబ్దాల కిందట తెలుగు ప్రేక్షకుల్ని మైమరిచిపోయేలా చేసిన సినిమా ?ఆదిత్య 369?. ఇప్పుడు చూసినా కొత్తగా అనిపించడం ఈ సినిమా ప్రత్యేకత. ఆ సినిమాకు సీక్వెల్ అంటూ చాలా ఏళ్ల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇదిగో అదిగో అంటున్నారు కానీ.. సినిమా మాత్రం కార్యరూపం దాల్చట్లేదు. ఈ ఏడాది ఆరంభంలో అనూహ్యంగా ఈ సినిమా వాస్తవ రూపం దాల్చేలా కనిపించింది. ?డిక్టేటర్? విడుదలకు ముందు ఇంటర్వ్యూలో తన తర్వాతి సినిమా ?ఆదిత్య 999? కావచ్చన్నట్లు మాట్లాడాడు బాలయ్య. ఈ సినిమాక స్టోరీ బోర్డ్ రెడీగా ఉందని.. కొన్ని నెలల్లోనే సినిమాను పూర్తి చేయడానికి అంతా సిద్ధమని అన్నాడు బాలయ్య.

కానీ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ?ఆదిత్య 999? పక్కకు వెళ్లిపోయింది. కృష్ణవంశీ ?రైతు? సినిమా ముందుకొచ్చింది. తర్వాత అది కూడా పక్కకు వెళ్లి ?గౌతమీపుత్ర శాతకర్ణి? బాలయ్య వందో సినిమాగా తెరకెక్కింది. ఇదయ్యాక అయినా ?ఆదిత్య 999? ఉంటుందేమో అనుకుంటే.. 101వ సినిమాగా ?రైతు? చేయడానికి రెడీ అయిపోయాడు బాలయ్య. దాని తర్వాత సినిమాలకు కూడా ఇప్పట్నుంచే చర్చలు నడుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ?ఆదిత్య 999? కార్యరూపం దాల్చడం సందేహంగానే కనిపిస్తోంది. సింగీతం వయసు ప్రస్తుతం 85 ఏళ్లు. ఈ వయసులోనూ ఓపిక చేసుకుని సినిమా చేయడానికి రెడీ అయ్యారు. కానీ బాలయ్య ఇప్పుడిప్పుడే ఖాళీ అయ్యే అవకాశాలు కనిపించట్లేదు. సింగీతం తప్ప ఇంకెవరూ ఆ సినిమా డీల్ చేయలేరని బాలయ్యే స్వయంగా చెప్పాడు ఇంతకుముందు. ఇంకో రెండు మూడేళ్లు గడిచాయంటే సింగీతంకు సినిమా చేసేంత ఓపిక ఉండకపోవచ్చు. చూస్తుంటే ఆదిత్య 999 అటకెక్కేసినట్లే కనిపిస్తోంది.

,  ,  ,  ,  ,