Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Sep-2017 11:06:44
facebook Twitter Googleplus
Photo

నాగచైతన్య-సమంత కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా ఏమాయ చేసావె ఒక క్లాసిక్. ఆ తర్వాత వీళ్లిద్దరూ కలిసి చేసిన సినిమాల్లో మనం మరో క్లాసిక్. ఆ సినిమా సమయానికే ప్రేమలో పడిపోయిన ఇద్దరూ గత ఏడాది తమ బంధం గురించి ఓపెనైపోయారు. ఇంకో నెల రోజుల్లో ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఐతే చైతూ-సామ్ ప్రేమ బంధం బయటపడ్డాక ఇద్దరూ కలిసి నటించలేదు. రారండోయ్ వేడుక చూద్దాం లో ఇద్దరూ కలిసి నటిస్తారన్న ప్రచారం జరిగింది కానీ.. అది నిజం కాలేదు. ఐతే మారుతి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించబోయే సినిమాలో వీళ్లిద్దరూ కలిసి నటించబోతున్నారంటూ గత వారం రోజులుగా గట్టి ప్రచారం జరుగుతోంది.

చైతూ-సామ్ జంట మళ్లీ తెరమీద కనిపిస్తే చూడాలని ఆశిస్తున్న అభిమానులు ఈ వార్త చూసి చాలా సంతోషించారు. ఐతే ఆ ఆనందాన్ని ఆవిరి చేసేశాడు చైతూ. మారుతి సినిమాలో తాను.. సమంత కలిసి నటించట్లేదని చెప్పాడు చైతూ. ఈ సినిమాకు సంబంధించి ఏదీ ఫైనలైజ్ కాలేదని అతనన్నాడు. ఇంకా కథ కూడా ఖరారవలేదని చెప్పాడు. మారుతి జస్ట్ లైన్ మాత్రమే చెప్పాడని.. ఇంకా స్క్రిప్టు పూర్తి చేయాల్సి ఉందని అన్నాడు. హీరోయిన్ గురించి ఇప్పుడే ఆలోచించే పరిస్థితి లేదని.. తాను.. సమంత కలిసి నటించేట్లయితే ఆ విషయం కచ్చితంగా తామే వెల్లడిస్తామని చైతూ అన్నాడు.

,  ,  ,  ,  ,  ,