Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-May-2016 12:43:52
facebook Twitter Googleplus
Photo

ప్రస్తుతం నార్త్ ఆఫ్రికా ఖండంలోని మొరాకో దేశంలో.. నందమూరి బాలకృష్ణ తన 100వ ''గౌతమీపుత్ర శాతకర్ణి'' సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా ప్రొడక్షన్ రేంజును చూసి.. ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో ఇట్టే అంచనాలు కూడా పెరిగిపోయాయ్. పైగా మనోళ్ళు విభిన్న ఫారిన్ లొకేషన్లలో ఒక హిస్టారికల్ తెలుగు సినిమాను షూట్ చేస్తున్నారంటే.. అది నిజంగానే అద్భుతం మరి.

ఇవన్నీ చూసుకుని.. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ కొనడానికి గతంలో 3.25 కోట్ల ఆఫర్ తో ఒక డిస్ర్టిబ్యూటర్ వచ్చారని మనం చెప్పుకున్నాం. కాని దర్శకుడు క్రిష్ మాత్రం అందుకు అంగీకరించలేదట. ఈలోపు మరొక పోటీదారుడు లైన్ లోకి దిగి.. వెంటనే 3.5 కోట్ల ఆఫర్ ఇచ్చాడట. ఇదేదో బాగుందే అనుకుని.. మన నిర్మాతలు ఏకంగా 4 కోట్లు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. కాని ఇప్పటివరకు ఓవర్సీస్ లో బాలయ్యకు అస్సలు మార్కెట్ లేదు కాబట్టి.. అక్కడ 1.5 మిలియన్ డాలర్లు వస్తేనే ఈ 4 కోట్లు వసూలు చేసుకోవడం కుదురుతుంది కాబట్టి.. ఇప్పుడు పంపిణీదారులు కంగారుపడుతున్నారు.

కాని రేటు తగ్గించుకోమని ఎంత చెప్పినా కూడా.. శాతకర్ణి మాత్రం.. అబ్బే తగ్గట్లేదు.

,  ,  ,  ,  ,