Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Jun-2016 10:37:34
facebook Twitter Googleplus
Photo

బాలయ్య ఓ వైపు వందో సినిమాను కంప్లీట్ చేస్తూనే... మరో వైపు తన తరువాత సినిమాలను కూడా పట్టాలెక్కించడానికి రెడీ అయపోతున్నాడు. ఇప్పటికే తన 101వ సినిమాపై క్లారిటీతో వున్నాడట. ఓ వైపు ఎమ్మెల్యేగా.. హిందూపురం నియోజకవర్గం బాధ్యతలను చూస్తూనే... మరో వైపు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి బాగోగులు చూస్తున్నాడు. ఇటీవలే అమెరికాలో నిధులను సేకరించి ఇండియాకు తిరిగొచ్చాడు. ప్రస్తుతం నటిస్తున్న వందో సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసి.. ఆ తరువాత కుమారుడు మోక్షు సినిమాతో పాటు.. తన 101వ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడట ఈ నందమూరి చిన్నోడు.

ఆ తరువాత బోయపాటితో ఓ సినిమా చేయనున్నాడు. ఇది ఎన్నికల ముందు రిలీజ్ అయ్యే అవకాశం వుంది. తన 101వ సినిమాను మాత్రం కృష్ణ వంశీ డైరెక్షన్లోనే చేయబోతున్నాడట. రైతు అనే పేరుతో తెరకెక్కే ఈ సినిమాకు కృష్ణ వంశీ కాకుండా వేరే వ్యక్తి కథ అందించబోతున్నాడట. బాలయ్యకు స్టోరీలైన్ బాగా నచ్చడంతో.. కృష్ణ వంశీని కూడా వినాలని సూచించడంతో.. కృష్ణ వంశీ తన వద్ద వున్న కథ కంటే.. ఇదే చాలా బాగుందని బాలయ్యతో అన్నాడట. దాంతో ఈ చిత్రానికి లైన్ క్లియర్ అయిపోంది. టాలీవుడ్లో మరో సంచలనానికి కూడా బాలయ్య తెర తీయబోతున్నాడనే టాక్ గత రెండు మూడు రోజులుగా టాలీవుడ్లో టాక్ వినబడుతోంది. బాలయ్య.. రాజమౌళి ఫ్యామిలీకి అండగా చాలా సందర్భాల్లో నిలిచాడు. బాహుబలి టిక్కెట్టు రేటు పెంచుకోవడంలోనైతేనేమీ... ఆ మూవీ ఆడియో నిర్వహణకు కావాల్సిన పర్మిషన్ల విషయంలో బాలయ్యే ముందుండి చూసుకున్నాడు.

అంతేకాదు.. బాలయ్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన బొబ్బిలి సింహం.. సమరసింహారెడ్డి లాంటి సూపర్ డూపర్ చిత్రాలకు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథను అందించారు. ఇప్పుడు ఇదే సాన్నిహిత్యంతోనే బాలయ్యతో రాజమౌళి ఓ భారీ చిత్రాన్ని కూడా తెరకెక్కించనున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇందులో మహేష్ బాబు కూడా నటిస్తాడట. ఈ విషయాన్ని ఓ స్టార్ ప్రొడ్యూసరే మీరు త్వరలో ఓ క్రేజీ కాంబినేషన్ ను రాజమౌళి డైరెక్షన్లో చూడబోతున్నారని చూచాయిగా తన సన్నిహితుల వద్ద వెల్లడించాడట. ఈ కాంబినేషనే సెట్టయితే.. టాలీవుడ్లో సంచలనమే.

,  ,  ,  ,  ,  ,  ,