Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Feb-2017 10:39:32
facebook Twitter Googleplus
Photo

ఓవైపు ఖైదీ నెంబర్ 150 కలెక్షన్ల విషయంలో ఎప్పటికప్పుడు అఫీషియల్ అప్ డేట్స్ వస్తున్నాయి. తొలి రోజు వసూళ్ల మీద అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి మరీ లెక్కలు చెప్పాడు. ఆ తర్వాత వీకెండ్ వసూళ్ల మీదా మాట్లాడాడు. కానీ ఖైదీ నెంబర్ 150 కి పోటీగా విడుదలైన నందమూరి బాలకృస్ణ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి కలెక్షన్ల గురించి మాత్రం అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఏమీ లేదు. దర్శక నిర్మాత క్రిష్ కానీ.. ఇంకొకరు కానీ.. బాక్సాఫీస్ ఫిగర్స్ గురించి మాట్లాడట్లేదు. చిరు సినిమాతో పోలిక సంగతి పక్కనపెడితే.. బాలయ్య కెరీర్లో ?శాతకర్ణి? బిగ్గెస్ట్ హిట్టుగా నిలవడం అభిమానులకు ఆనందాన్నిచ్చిన విషయం. ఈ చిత్రం బాలయ్యకు తొలి 50 కోట్ల షేర్ మూవీగానూ నిలిచింది. కానీ ఈ సంగతులేవీ అధికారికంగా చెప్పలేదు శాతకర్ణి టీం.

ఐతే సినిమా విడుదలై 20 రోజులు దాటాక ఎట్టకేలకు హీరో బాలకృష్ణే కలెక్షన్ల గురించి ప్రస్తావించాడు. అలాగని ఆయనేమీ వివరాలు చెప్పలేదు. టి.సుబ్బిరామిరెడ్డి శాతకర్ణి టీంను సత్కరించిన సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. పండక్కి ఏ సినిమా ఎక్కువ కలెక్షన్లు సాధించిందో అందరికీ తెలుసు. ఐతే మాకు నంబర్ల గురించి పట్టింపు లేదు. నా సినిమాల్ని ఎక్కడ పెట్టాలో.. వాటి స్థానమేంటో నా అభిమానులకు తెలుసు. ఈ విషయాలన్నీ నా అభిమానులు చూసుకుంటారు. వాళ్లే నాకు అన్నీ?? అని నర్మగర్భమైన వ్యాఖ్యలు చేశారు బాలయ్య. ఈ వ్యాఖ్యలపై ఒక్కొక్కరు ఒక్కో రకంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. కొందరేమో కలెక్షన్ల కంటే కంటెంట్ గొప్పదని బాలయ్య చెప్పదలుచుకున్నాడని అంటే.. ఇంకొందరు నిజాయితీగా ఖైదీ నెంబర్ 150 కలెక్షన్లే ఎక్కువ అని ఒప్పుకున్నాడని అంటున్నారు. ఏదేమైనా బాలయ్య వ్యాఖ్యలు చర్చనీయాంశం అయితే అయ్యాయి.

,  ,  ,  ,