Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Sep-2016 11:45:33
facebook Twitter Googleplus
Photo

నారా రోహిత్ నటించిన లేటెస్ట్ మూవీ జ్యో అచ్యుతానంద.. ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. శ్రీనివాస్ అవసరాల డైరెక్షన్ లో రూపొందిన ఈ రొమాంటిక్ మూవీని.. ఆడియన్స్ బాగానే ఆదరిస్తున్నారు. కలెక్షన్స్ రోజురోజుకూ పెరుగుతుండడం చూస్తే.. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా మేజిక్ చేసేట్లుగానే కనిపిస్తోంది. ఈ మధ్య కొంచెం ట్రాక్ తప్పిన నారా రోహిత్.. మళ్లీ ఫాంలోకి వచ్చేశాడని చెప్పాలి.

ముఖ్యంగా నారా రోహిత్ నటన.. నాగశౌర్యకి బ్రదర్ గా పండించిన కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరాయి. మూవీకి అన్నివర్గాల నుంచి ఆదరణ లభిస్తున్న టైమ్.. అనుకోని విధంగా నందమూరి బాలకృష్ణ నుంచి ప్రశంసలు రావడంతో నారా రోహిత్ బోలెడంత హ్యాపీ అయిపోతున్నాడు. 'నిన్ను చూసి గర్వపడుతున్నా నారా రోహిత్. జ్యో అచ్యుతానంద సక్సెస్ చాలా హ్యాపీగా ఉన్నా. మంచి రోల్స్.. పెర్ఫామెన్స్ మరిన్ని చేస్తావని ఆశిస్తున్నా. ఫ్యూచర్ ప్రాజెక్టులకు బెస్టాఫ్ లక్' అని చెప్పారు బాలయ్య.

నందమూరి నటసింహం నుంచి ఈ రేంజ్ లో ప్రశంసలు రావడంతో.. నారా రోహిత్ తో పాటు.. జ్యో అచ్యుతానంద టీమ్ కూడా హ్యాపీ అయిపోయింది. ఏకంగా బాలయ్యే పొగిడేయడంతో.. ఇప్పుడీ మూవీకి నందమూరి అభిమానుల అండ కూడా లభించే ఛాన్సులు పుష్కలంగా ఉన్నాయి.

,  ,  ,  ,  ,