Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Feb-2017 10:47:04
facebook Twitter Googleplus
Photo

ఆన్ స్క్రీన్ పై విజువల్స్ ను రిచ్ గా చూపించేందుకు.. ఫారిన్ లొకేషన్స్ ఎంచుకుంటూ ఉంటారు. చాలా ఖర్చు చేసి ఫారిన్ కంట్రీస్ చుట్టొచ్చి షూటింగ్ లు చేశామని చెప్పేవాళ్లు కూడా ఉంటారు. అయితే.. వాస్తవం ఏంటంటే.. ఇక్కడ షూటింగ్ కంటే.. ఫారిన్ లోనే చవగ్గా పూర్తి చేసేయచ్చని చెబుతున్నారు మేకర్స్.

ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాలను పరిశీలిస్తే.. వరుణ్ తేజ్ ఫిదా.. మహేష్ బాబు-వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రానున్న మూవీ.. విజయ్ మద్దాల తో అవసరాల మూవీ.. చైతన్య కృష్ణ.. హను రాఘవపూడిలతో నితిన్ చేయనున్న రెండు సినిమాలు.. శివ నిర్వాణ అనే దర్శకుడితో నాని చేయనున్న సినిమాలన్నీ.. అమెరికాలోనే షూటింగ్ ప్లాన్ చేశారు. ఎక్కువ భాగం ఇక్కడే షూట్ చేస్తారట. ఇందుకు కారణం.. బడ్జెట్ కంట్రోలింగ్ అని అంటున్నారు.

యూరోప్ లో కంటే యూఎస్ లో షూటింగ్ చాలా చవక అని చెబుతున్నాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. లాజిస్టిక్స్ తో సహా అన్నిటినీ తేలికగా చవకగా సమకూర్చుకోవచ్చని చెప్పాడు. కానీ ముందుగా పక్కా ప్లానింగ్ తో ఉంటేనే సాధ్యమన్న వంశీ.. జిమ్మీ జిబ్ ని అమెరికాలో ఒకడే వ్యక్తి హ్యాండిల్ చేస్తాడని.. యూరోప్ కానీ-మన దేశంలో కానీ అయితే 6-7గురు వ్యక్తులు ఆ ఒక్క ఎక్విప్మెంట్ పై పని చేస్తారని అన్నాడు. వర్క్ ట్యాలెంట్ విషయంలో చాలా డిఫరెన్స్ ఉంటుందని చెప్పాడు వంశీ పైడిపల్లి.

అయితే.. భారీ ఎక్విప్మెంట్ ను ఇక్కడి నుంచి అమెరికా తీసుకెళ్లడం సాధ్యం కాదు కాబట్టి.. సరైన ప్లానింగ్ తో వర్క్ పర్మిట్స్.. వీసాలు వంటివి ముందుగా ఏర్పాటు చేసుకోగలిగితే.. యూఎస్ లో షూటింగ్ చేయడమే చవక అంటున్న నల్లమలుపు బుజ్జి... ఒకసారి వర్క్ ప్రారంభిస్తే.. ఎలాంటి అవాంతరాలు లేకుండా పూర్తి చేసుకునే అవకాశం అక్కడ లభిస్తుందని చెబుతున్నాడు.

,  ,  ,  ,  ,