Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Jul-2017 12:58:05
facebook Twitter Googleplus
Photo

దర్శకుడు పూరీ జగన్నాథ్ బాగా ట్యాలెంటెడ్. ఎప్పుడు ఏ హీరోతో సినిమా చేస్తుంటే.. తన హీరోను భలే డిఫెండ్ చేసుకుంటూ ఉంటాడు. అందరు ఫిలిం మేకర్స్ చెప్పేది ఇదే అయినా.. పూరీ వాక్చాతుర్యం ముందు మిగిలిన వాళ్లు అంతగా ఆనరనే విషయం ఒప్పుకోవాలి.

రీసెంట్ గా శమంతక మణి మూవీ ఆడియో ఫంక్షన్ జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చాడు దర్శకుడు పూరీ జగన్నాథ్. నిజానికి ఈ ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా రావాల్సిన వ్యక్తి నందమూరి బాలకృష్ణ. పూరీ-బాలయ్య కాంబినేషన్ లో వస్తున్న పైసా వసూల్ చిత్రానికి.. ఈ శమంతకమణి మూవీకి.. రెండిటికీ నిర్మాత ఒకరే కావడమే.. ఈ ఫంక్షన్ కు బాలయ్య వస్తానని చెప్పేందుకు కారణం. అయితే.. ఆఖరి నిమిషం వరకూ బాలకృష్ణ వస్తారని భావించినా.. చివరకు అది కార్యరూపం దాల్చలేదు. అలా ఎందుకు చెప్పాడు సవివరంగా తన స్టైల్ లో ఓ స్టోరీ ఫార్మాట్ లో చెప్పాడు పూరీ.

శమంతకమణి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఇద్దరం కలిసి వెళ్దామని బాలయ్య నిన్నే నాతో చెప్పారు. పొద్దున షూటింగ్ స్పాట్ లో కూడా ఇదే విషయం మాట్లాడుకున్నాం. సాయంత్రం షూటింగ్ అయిపోయాక కూడా వెళ్తూ వెళ్తూ గుర్తు చేశారు. కానీ సడెన్ గా తనకు ఫుడ్ పాయిజన్ అయిందని.. ఈవెంట్ కు రాలేకపోతున్నానని చెప్పారు బాలయ్య.

,  ,  ,  ,