Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Apr-2016 11:04:13
facebook Twitter Googleplus
Photo

ఈ ఏడాది సంక్రాంతికి నాలుగు సినిమాలు పోటీ పడ్డాయి. అందులో ?సోగ్గాడే చిన్నినాయనా? బిగ్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా వందకు పైగా సెంటర్లలో యాభై రోజులు ఆడటం విశేషం. వంద రోజుల సెంటర్లు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నట్లు తెలుస్తోంది. దీని కంటే ముందు నాన్నకు ప్రేమతో.. డిక్టేటర్.. కూడా 100 డేస్ పూర్తి చేసుకుంటున్నాయి. జనవరి 13న రిలీజైన ?నాన్నకు ప్రేమతో? కర్నూలు జిల్లా ఆదోనిలో వంద రోజులాడగా.. మరుసటి రోజు విడుదలైన ?డిక్టేటర్? విజయనగరం జిల్లా చీపురుపల్లిలో 100 రోజుల మైలురాయిని అందుకుంది. విశేషం ఏంటంటే.. డిక్టేటర్ 100 రోజులు పూర్తి చేసుకుంటున్న రోజే.. బాలయ్య 100వ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంటోంది.

ఈ సందర్భంగా ఈ నెల 24న చీపురపల్లిలో డిస్ట్రిబ్యూటర్ భరత్ డిక్టేటర్ వందరోజుల ఉత్సవాన్ని అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహిస్తున్నాడు. తన దర్శకత్వంలో వచ్చిన ?డిక్టేటర్? 100 రోజులు పూర్తి చేసుకుంటున్న రోజే.. ?గౌతమీపుత్ర శాతకర్ణి? ప్రారంభోత్సవం జరుపుకోబోతుండటం పట్ల శ్రీవాస్ సంతోషం వ్యక్తం చేస్తూ ఓ యాడ్ కూడా ఇచ్చాడు. ??డిక్టేటర్ సినిమా ద్వారా బాలయ్యబాబు లాంటి మంచి వ్యక్తి పరిచయం కావడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయన నన్ను తన ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేశారు. అలాంటి మంచి మనసున్న బాలయ్య నటించిన మా ?డిక్టేటర్? 100వ రోజున ప్రారంభమవుతున్న ప్రతిష్టాత్మక 100వ చిత్రం చరిత్రలో నిలిచిపోయేలా విజయం సాధించాలని కోరుకుంటున్నా?? అని శ్రీవాస్ అన్నాడు.

,  ,  ,  ,  ,  ,  ,  ,