Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Apr-2016 19:07:56
facebook Twitter Googleplus
Photo

ప్రముఖ నటుడు నందమూరి బాలక్రిష్ణ, దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న ?గౌతమి పుత్ర శాతకర్ణి? ఈ రోజు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హీరో బాలక్రిష్ణ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు అభిమానులతో ఉన్న సంబంధం విడదీయరానిదని, అభిమానులు, తెలుగు ప్రేక్షకుల ఆదరణ, అభిమానం తనని ఇంతటివాడిని చేశాయని చెపుతూ గౌతమి పుత్ర శాతకర్ణి పాత్ర పోషించే అవకాశం రావడం అదృష్టమని? అందుకే ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగుప్రజలకి అంకితమిస్తున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ బాలక్రిష్ణ ఈ పాత్ర పోషించడం ద్వారా తెలుగు సినిమా చరిత్రలో చరిత్ర సృష్టించాడని అనగా విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ బాలక్రిష్ణ వందో సినిమా రెండువందల రోజులు ఆడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. శక చక్రవర్తియైన విక్రమాదిత్యుని ఓడించి శాలివాహన శకానికి నాంది పలికిన ?గౌతమీపుత్ర శాతకర్ణి? కథ ఆధారంగా చారిత్రక నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాని దాదాపు 50 కోట్లకు పై బడ్జెట్ తో రూపొందిస్తున్నట్లు సమాచారం.

,  ,  ,  ,  ,  ,  ,  ,