Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Feb-2017 10:11:21
facebook Twitter Googleplus
Photo

ప్రతీ సినిమాకి డిఫరెంట్ స్టైల్ ప్రమోషన్ తప్పనిసరి అయిపోయింది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త దారులు చూపిస్తూ.. మేకర్స్ ఆకట్టుకుంటున్నారు. ఈ విషయంలో సినిమాలనే డిఫరెంట్ గా ఎంచుకునే బిచ్చగాడు హీరో విజయ్ యాంటోనీ.. తన కొత్త మూవీ యమన్ విషయంలో సెన్సేషనల్ పోస్టర్ తో అబ్బురపరిచాడు.

ప్రతీ హీరో డిఫరెంట్ గా ప్రయత్నించిన మూవీ ఏదో ఒకటి ఉంటుంది. కానీ అందరినీ కలిపి ఒకే సినిమా కోసం వాడేయడం అంత సులభమైన విషయం కాదు. కానీ విజయ్ యాంటోనీ మాత్రం.. కోలీవుడ్ హీరోలు విభిన్నమైన పాత్రలు చేసిన పోస్టర్ల మధ్యలో తన యమన్ ని జత చేసి.. 24న రిలీజ్ అంటూ ఓ పోస్టర్ ఇచ్చాడు. ఇందులో అభయ్ గా కమల్ హాసన్.. రోబోగా రజినీకాంత్.. ఇంకా సూర్య.. మాధవన్.. అరవింద్ స్వామి. ప్రసన్న.. జయం రవి.. కార్తి.. సత్య రాజ్.. అర్జున్.. విజయ్.. విక్రమ్.. బాబీ సింహ.. అర్జున్ విజయ్.. అజిత్.. ఇలా అందరు స్టార్లను ఒకే పోస్టర్ లోకి తెచ్చాడు.

అయితే ఈ పోస్టర్లో కనిపిస్తున్న స్టార్లందరూ.. నెగెటివ్ షేడ్లతో చేసిన రోల్స్ అవి. తద్వారా తాను కూడా యమాన్ సినిమాలో చేస్తున్న నెగెటివ్ రోల్ కు కొత్త మార్కు హీరోయిజమ్ ఆపాదించే ప్రయత్నం చేశాడన్నమాట. ఇక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న యమన్ మూవీ పోస్టర్ లో.. విజయ్ యాంటోనీ ఓ పౌరాణిక గెటప్ తో కనిపించడం ఆకట్టుకుంటోంది.

,  ,  ,  ,  ,  ,  ,