Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Oct-2017 12:20:18
facebook Twitter Googleplus
Photo

రాజశేఖర్ కు కమ్ బ్యాక్ మూవీ అవుతుందని భావిస్తున్న గరుడవేగ కు సంబంధించి థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ అయి.. మంచి స్పందనే రాబట్టుకుంది. ఈ ట్రైలర్ మరో సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ లాంచ్ చేయడం విశేషం. ఈ సందర్భంగా బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

నిర్మాత బాగుండాలి. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది. అందుకే గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాని 79రోజుల్లో పూర్తి చేశాం. త్వరగా అంటే సినిమా చుట్టేయడం కాదు. బాగా తీయడం కూడా ముఖ్యమే. ప్రతి సినిమాకీ డబ్బు ఖర్చు పెట్టాల్సిన పనిలేదు. ఎంత ఖర్చు పెడుతున్నామన్నది నిర్మాతలకే తెలియని పరిస్థితుల్లో ఇండస్ట్రీ ఉంది. గరుడవేగ ట్రైలర్ అద్భుతంగా ఉంది. మనకున్న అరుదైన దర్శకుల్లో ప్రవీణ్ సత్తారు ఒకరు. రాజశేఖర్ విలక్షణ నటుడు. ఆయన ఎంచుకునే కథలు.. పాత్రలే కాదు.. నటన కూడా భిన్నంగా ఉంటుంది. నవంబర్ 3న విడుదలవుతున్న ‘గరుడవేగ’ సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నాడు బాలయ్య.

ఇక రాజశేఖర్ మాట్లాడుతూ బాలకృష్ణ ఎక్కడికెళితే అక్కడ అదృష్టమని ఇండస్ట్రీలో అందరికీ తెలుసుని.. ఆయన చేతుల మీదుగా తమ సినిమా ట్రైలర్ రిలీజవుతోంది కాబట్టి ఆ అదృష్టం తమకూ వచ్చి సినిమా పెద్ద విజయం సాధిస్తుందని ఆశిస్తున్నామని అన్నాడు.

,  ,  ,  ,  ,  ,