Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Oct-2016 13:25:14
facebook Twitter Googleplus
Photo

ఇజం సినిమా గురించి ఇప్పుడేమీ మాట్లాడనంటున్నాడు కళ్యాణ్ రామ్. ఆ సినిమా రిలీజ్ రోజు మాత్రం చాలా సేపు మాట్లాడతానని.. ముఖ్యంగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి మాత్రం గంట మాట్లాడతానని ఒకటికి రెండుసార్లు నొక్కి వక్కాణించాడు నందమూరి హీరో.

మామూలుగా తాను వేదికలు ఎక్కితే పెద్దగా మాట్లాడ్డానికి ఇష్టపడనని.. ఐతే ?ఇజం? గురించి మాత్రం చాలా మాట్లాడాలని కోరికగా ఉందని చెప్పిన కళ్యాణ్.. అయినప్పటి ప్రస్తుతానికి తన ఉద్వేగాన్ని అణుచుకుని ?ఇజం? సినిమా రిలీజయ్యే వరకు ఎదురు చూస్తానన్నాడు. రిలీజ్ రోజు మాత్రం కచ్చితంగా మాట్లాడతానని.. ముఖ్యంగా పూరి గురించి గంట మాట్లాడతానని అన్నాడు కళ్యాణ్ రామ్. 13 ఏళ్ల కెరీర్లో తాను 13 సినిమాలు చేశానని.. తాను పని చేసిన డైరెక్టర్లలో పూరి జగన్నాథే ది బెస్ట్ అనడంలో సందేహం లేదని.. అలాగే తాను పని చేసిన బెస్ట్ టీమ్ కూడా ఇదేనని కళ్యాణ్ రామ్ అన్నాడు. ఇదే టీంతో మళ్లీ పని చేయాలని ఉందని.. పూరితో మాట్లాడి ఎవరైనా మళ్లీ సినిమా చేయడానికి ఒప్పించాలని కళ్యాణ్ రామ్ చమత్కరించాడు.

ఇజం సినిమా ఓకే అయింది ఫిబ్రవరి 4న అని.. ఆ రోజు రాత్రి 11..30కు తన తమ్ముడు ఎన్టీఆర్ ఫోన్ చేసి తనతో సినిమా చేయడానికి పూరి జగన్నాథ్ ఒప్పుకున్న విషయం చెప్పాడని.. ఈ విషయాన్ని తాను ఎప్పటికీ మరిచిపోలేనని కళ్యాణ్ రామ్ అన్నాడు. తనతో సినిమా చేయడానికి ఒప్పుకున్నందుకు పూరికి థ్యాంక్స్ అని కూడా కళ్యాణ్ రామ్ అన్నాడు. ?ఇజం? కోసం అందరం చాలా కష్టపడ్డామని.. ఐతే పూరి నుంచి తామందరం ఎనర్జీ తీసుకున్నామని చెప్పాడు.

,  ,  ,  ,  ,