Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Sep-2017 11:35:52
facebook Twitter Googleplus
Photo

మీడియాతో ఉపయోగాలు ఏవి అని లెక్క కడితే.. ఇతమిత్థంగా ఇవీ అని చెప్పడం చాలా కష్టమే. కానీ దాని వల్ల చెడు ఏంటి అంటే మాత్రం చాలానే చెప్పచ్చు. ముఖ్యంగా ప్రముఖుల విషయంలో రూమర్లను స్ప్రెడ్ చేయడంలో.. సోషల్ మీడియాది కీలక పాత్ర.. తీరా ఆయా వ్యక్తులు స్వయంగా అదే సోషల్ మీడియాలోకి వచ్చి.. తమకేం కాలేదు మొర్రో అని మొత్తుకోవాల్సి వస్తోంది.

ఈ మధ్య గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం విషయంలో ఇలాగే జరిగింది. ఆయన ఏదో రెగ్యులర్ చెకప్ కోసం ఆస్పత్రికి వెళితే.. బాలుకు ఏదో జరిగిపోయిందంటూ ప్రచారం మొదలైపోయింది. ఆయన సోషల్ మీడియా పేజ్ లో బోలెడన్ని ఎంక్వైరీలు వచ్చి పడిపోతున్నాయట. పరామర్శలు కూడా చేసేస్తున్నారట చాలామంది జనాలు. దీంతో ఆయనే స్వయంగా ఓ వీడియో షూట్ చేయించుకుని.. తనకేం కాలేదని ఆరోగ్యం లక్షణంగా ఉందని చెప్పారు బాలు. అసలు ఇలాంటివి ఎలా ప్రచారం అవుతాయో అర్ధం కాదని అన్నారాయన. తన ఆరోగ్యం బాగోకపోవడం కారణంగా.. పలు కార్యక్రమాలను రద్దు చేసేసుకున్నారనే ప్రచారం కూడా జరిగింది.

నేను కొన్ని కార్యక్రమాలను రద్దు చేసుకోవడానికి అసలు కారణం ఏంటంటే.. నా సోదరి గిరిజ కాలధర్మం చేశారు. అందుకే 12 రోజులు కుటుంబంతోనే ఉన్నాను. ఆఖరికి దగ్గు జలుబు లాంటివాటితో ఆస్పత్రికి వెళ్లినా రూమర్స్ మొదలైపోతున్నాయి. తోచినట్లుగా రూమర్లు సృష్టించి.. ఇలా అందరినీ ఎందుకు బాధ పెడతారో అర్ధం కాని విషయం

,  ,  ,  ,