Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Jun-2016 17:52:22
facebook Twitter Googleplus
Photo

ఇప్పటివరకు సరైన హిట్ లేని కళ్యాణ్ రామ్.. మొన్నామధ్యన 'పటాస్' సినిమాతో మాంచి హిట్టు కొట్టాడు. అయితే ఆ హిట్టు తాలూకు విన్నింగ్ స్ర్టీక్ కంటిన్యూ చేయాలనే యోచనలో ఉన్నప్పుడు.. అప్పుడెప్పుడో తీసిన 'షేర్' సినిమా ఒకటి బయటకొచ్చి బాగా డిజప్పాయింట్ చేసింది. అందుకే ఇప్పుడు రూటు మార్చి ఏకంగా పూరి జగన్ తో వర్కు చేస్తున్నాడు.

ఆల్రెడీ రామోజీ ఫిలిం సిటీలో పూరి-కళ్యాణ్ రామ్ సినిమా షూటింగ్ తెగ స్పీడుగా సాగుతోంది. ఖచ్చితంగా ఈ సినిమా కూడా దసరా రేసులో ఉంటుందని వేరే చెప్పక్కర్లేదు. ఈ సినిమా షూటింగ్ స్పాట్ లో చూస్తే.. ఒక కోర్టు సీనులో బలంగా డైలాగులు చెబుతున్న కళ్యాణ్ రామ్ మనకి కనిపిస్తున్నాడు. ఈ లొకేషన్ నుండి లీకైనా స్టిల్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా హల్ చల్ చేస్తున్నాయి మరి. ఓ రకంగా చూస్తుంటే.. ''టెంపర్'' సినిమాలో జూ.ఎన్టీఆర్ ఎలాగైతే తన వినూత్న నటనతో ఆకట్టుకున్నాడో.. ఇక కళ్యాణ్ రామ్ కూడా అలాగే చేసేలా ఉన్నాడు.

ఈ మధ్యకాలంలో పూరి జగన్ కూడా భారీ హిట్లు కొట్టలేదు. జ్యోతిలక్ష్మి - లోఫర్ వంటి సినిమాలు నిరాశ పరిచాయి. మరి మనోడు కూడా నందమూరి హీరోతో కలసి ఓ పెద్ద హిట్టునే కొట్టాలి

,  ,  ,  ,  ,  ,