Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Aug-2017 12:07:25
facebook Twitter Googleplus
Photo

నందమూరి బాలకృష్ణతో పోటీ పడే హీరో ఎవరు ఉన్నారంటే.. చెప్పడం చాలా కష్టమైన విషయమే. ఆయన తరంలోనే కాదు.. ఈ తరం హీరోల్లో కూడా ఇంకా బాలయ్యకు పోటీ రాగల హీరో ఎవరూ లేరనే చెప్పాలి. అయితే.. యంగ్ హీరో దగ్గుబాటి రానా మాత్రం బాలయ్యతో పోటీ పడి డైలాగులు చెప్పాడట. అది కూడా ఏమంటివి ఏమంటివి అంటూ ఎన్టీఆర్ చెప్పే ఫేమస్ డైలాగ్ ను ఇద్దరూ చెప్పారని తెలుస్తోంది.

బాలయ్య.. రానా.. ఈ కాంబో ఎలా సెట్ అయిందనేగా మీ డౌట్.. నెంబర్ 1 యారీ అంటూ రానా ఓ సెలబ్రిటీ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ శుక్రవారం పైసా వసూల్ రిలీజ్ సందర్భంగా.. ప్రస్తుతం బాలయ్య ప్రమోషనల్ యాక్టివిటీస్ లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా రానా టీవీషోకి వెళ్లారట. రీసెంట్ గా ఈ ప్రోగ్రాం షూటింగ్ చేయగా.. ఈ ఎపిసోడ్ మొత్తానికి బాలయ్య-రానాలు ఇద్దరూ కలిసి చెప్పిన డైలాగ్ హైలైట్ అవుతుందని తెలుస్తోంది. ఇప్పటివరకూ పిక్చరైజ్ చేసిన అన్ని ఎపిసోడ్స్ లోనూ.. ఇదే బెస్ట్ ఎపిసోడ్ అంటున్నారు కూడా. మరి బాలయ్య-రానా కలిసి ఏ రేంజ్ లో హంగామా చేశారో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

అయితే.. రానా టీవీ షోకి హాజరైన బాలయ్య.. ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ కి మాత్రం వెళ్లడం లేదు. నందమూరి హీరోనే అయినా.. నెంబర్ 1 యారీ కంటే.. బిగ్ స్కేల్ ఉన్న రియాల్టీ షో అయినా.. ఉద్దేశ్యపూర్వకంగానే బిగ్ బాస్ హౌస్ కి వెళ్లడం లేదట బాలకృష్ణ.

,  ,  ,  ,  ,