Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Aug-2017 11:21:23
facebook Twitter Googleplus
Photo

ఫిలిం ఇండస్ర్టీలో చాలామంది కొంత కాలం స్నేహితులుగా.. కొంతకాలం శత్రువులుగా ఉంటుంటారు. ఎవ్వరూ కూడా పర్మినెంట్ గా ఒకే తరహాలో ఉండిపోరు. అలా ఉంటే మాత్రం వారిని ఎవ్వరూ మార్చలేరులే. అయితే గత కొంత కాలంగా ఎన్టీఆర్ కు అలాగే నిర్మాత బండ్ల గణేష్ కు ఏవో తేడాలు వచ్చేశాయి. ఇప్పుడు అవన్నీ పక్కనెట్టేసి ఈ బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ తో ఎన్టీఆర్ ఒక సినిమా చేస్తున్నాడా?

నిజానికి ఎన్టీఆర్ అసలు బండ్ల గణేష్ తో ప్యాచప్ ఎలా అయ్యాడో తెలియదు కాని.. అయినట్లు న్యూసులు వస్తున్నాయి. అప్పటికే 'బాద్షా' సినిమా ఎన్టీఆర్ తో తీసి.. అది హిట్టయినా కూడా డబ్బులు నష్టపోయాడు గణేష్. ఆ తరువాత 'టెంపర్' సినిమాతో రికవరీ అవుతాడు అనుకుంటే.. అప్పుడు కూడా ఏవో గొడవలు వచ్చేశాయి. పేమెంట్ మొత్తం ఇస్తేనే ఎన్టీఆర్ డబ్బింగ్ చెబుతానన్నాడని రూమర్లు కూడా వినిపించాయి. అవన్నీ కరక్టే అన్న చందాన బండ్ల బాబు కూడా చాలా ఇంటర్యూల్లో అవాకులూ చివాకులూ పేలాడు. కట్ చేస్తే అసలు టెంపర్ సినిమాను సచిన్ జోషి కొనేసుకుని.. తనకు బండ్ల చాలా డబ్బులు అప్పుబడ్డాడంటూ కోర్టుకు కూడా వెళ్ళాడు. ఇవన్నీ జరుగుతుంటే.. బండ్ల మాత్రం టెంపర్ తరువాత మళ్లీ సినిమానే ప్రొడ్యూస్ చేయలేదు. బండ్ల నిజంగానే ఏదో గడబిడ చేశాడంటూ చాలా రూమర్లు వచ్చాయిలే.

ఇకపోతే ఇప్పుడు ఎన్టీఆర్ తో మనోడు ప్యాచప్ చేసుకుని ఓ కొత్త సినిమాను తీస్తున్నాడు అంటూ రూమర్లు వచ్చాయిగాని.. అందులో నిజంలేదనే అంటున్నారు సన్నిహితులు.

,  ,  ,  ,  ,