Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Nov-2017 10:08:39
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాల పేరు చెబితే హీరోయిన్ విజయశాంతి గుర్తుకు వచ్చేది. ప్రస్తుతం ఆ స్థానాన్ని అనుష్క భర్తీ చేసిందని చెప్పవచ్చు. అరుంధతి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అనుష్క ఆ తర్వాత పంచాక్షరి - రుద్రమదేవి లతో మంచి సక్సెస్ ను అందుకుంది. తాజాగా - అనుష్క లీడ్ రోల్ లో రాబోతోన్న లేడీ ఓరియెంటెడ్ మూవీ భాగమతి సినిమాపై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. అనుష్కపై నమ్మకంతో దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్ తో యువి క్రియేషన్స్ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఆ బడ్జెట్ ను వెనక్కు రాబట్టుకునేందుకు వారు గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్ర తమిళ రైట్స్ ను రూ.10 కోట్ల భారీ రేటుకు అమ్మినట్లు వార్తలు వస్తున్నాయి.

యువి క్రియేషన్స్ అధినేతలకు స్టూడియో గ్రీన్ అధినేత జ్ఞానవేల్ రాజాకు సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో రాజా ఈ చిత్రాన్ని తమిళంలో రిలీజ్ చేయబోతున్నాడట. రూ.10 కోట్లకు భాగమతి తమిళ వెర్షన్ థియేట్రికల్ హక్కులతో పాటు శాటిలైట్ రైట్స్ కూడా తీసుకున్నట్లు సమాచారం. అయితే రాజా నిర్మాణంలో సూర్య హీరోగా తెరకెక్కుతున్న గ్యాంగ్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో యువి నిర్మాతలు థియేటర్లు ఇప్పించడంలో హెల్ప్ చేస్తారట. ఆ చిత్రం సంక్రాంతి బరిలో రానుండడంతో థియేటర్లకు ఇబ్బంది లేకుండా యువి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. రూ.10 కోట్లు తమిళం నుంచే రావడంతో మిగతా బడ్జెట్ రికవరీ కావడం పెద్ద విషయం కాదని ట్రేడ్ టాక్. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

,  ,  ,  ,  ,