Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Jul-2017 15:02:30
facebook Twitter Googleplus
Photo

ఎప్పుడూ వివాదాలకు ఉండడం ఈ మాస్ హీరోకు అలవాటు. అయితే.. మొదటిసారిగా ఈ డ్రగ్ వివాదంలో రవితేజ పేరు చిక్కుకుంది. నోటీసులు అందుకున్న 12 మందిలో రవితేజ కూడా ఉన్నాడనే న్యూస్ విస్తృతంగానే వినిపిస్తోంది. దీనిపై మాస్ మహరాజ్ ఇప్పటివరకూ రియాక్ట్ కాలేదు కానీ.. ఈ హీరో అమ్మ ఇప్పుడు స్పందించారు.

రవితేజ కనీసం సిగరెట్ కూడా కాల్చడు. కానీ డ్రగ్స్ కేసులో తన పేరును ఉపయోగిస్తున్నారు. తనను భరత్ తో లింక్ చేయకండి. ఎలాంటి అలవాట్లు లేని రవితేజ ఓ జెంటిల్మన్. మా కుటుంబ ఆచారాల కారణంగానే.. తను భరత్ అంత్యక్రియలకు హాజరు కాలేదు. తమ్ముడు పోయిన బాధలో ఉండి కూడా.. నిర్మాతలు నష్టపోకూడదనే ఉద్దేశ్యంతో షూటింగ్ లో పాల్గొంటున్న మంచి వ్యక్తి నా కొడుకు అన్నారామె.

మొదటిసారిగా మీడియాకు స్టేట్మెంట్ ఇచ్చిన రవితేజ తల్లి భరత్ డ్రగ్స్ మత్తులో ప్రాణం పోగొట్టుకున్నాడని అనడం కరెక్ట్ కాదు. మంచి వ్యక్తిగా మారేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆల్కహాల్ తీసుకోవడం కూడా మానేశాడు. బిగ్ బాస్ షో కోసం కూడా ఎంపికయ్యాడు. కానీ ఆ యాక్సిడెంట్ భరత్ ను మాకు దూరం చేసింది

,  ,  ,  ,  ,