Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Sep-2017 13:08:04
facebook Twitter Googleplus
Photo

బిగ్బాస్ చివరి అంకం మొదలైంది. మరో వారం రోజుల్లో బిగ్ బాస్ మొదటి సీజన్ విజేత ఎవరో తేలిపోనున్నారు. తెలుగు టీవీ చరిత్రలో అత్యధిక రేటింగ్ను సొంతం చేసుకున్న బిగ్ బాస్ కార్యక్రమం.. ఆశించిన దాని కంటే ఎక్కువ ప్రేక్షకాదరణ పొందిందని చెప్పాలి. మిగిలిన భాషల్లో తలెత్తే వివాదాలు.. చౌకబారు చేష్టలకు దూరంగా ఉన్న ఈ షో.. తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచిందని చెప్పాలి. ఈ వారాంతంలో ముగిసే మొదటి సీజన్ లో ఫైనలిస్ట్ గా అర్చన.. అదర్శ్.. శివబాలాజీ.. నవదీప్.. హరితేజ నిలిచారు. చివరి వారంలో ఆఖరి ఎలిమేషన్ నటి దీక్షా పంత్ అయ్యారు.

ఈ షోలో నోట్లో నాలుక లేని అమ్మాయిగా.. సెన్సిటివ్గా.. అమాయకం అన్నట్లుగా నిలిచిన దీక్ష.. షో నుంచి ఎలిమినేట్ అయ్యాక చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా ఆమె ఇమేజ్ మొత్తాన్ని మార్చేశాయని చెప్పాలి. ఎలిమినేట్ అయిన వెంటనే ఐదు నిమిషాల్లో బ్యాగ్ సర్దుకొచ్చే క్రమంలో బిగ్ బాస్ హౌస్ లోని తోటి సభ్యులంతా ఎంతో కొంత ఎమోషనల్ కావటం కనిపిస్తుంది.

ఇప్పటివరకూ ఎలిమినేట్ అయిన వారందరి విషయంలోనూ ఇలాంటిదే చోటు చేసుకుంది. కానీ.. తాజాగా ఎలిమినేట్ అయిన దీక్ష విషయంలో పెద్దగా ఎమోషనల్ కాకపోవటం కనిపించింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత.. తారక్ తో కలిసి మాట్లాడే సమయంలో బిగ్ బాస్ ఇంట్లో ఉన్న వారందరిని నెగిటివ్ వ్యాఖ్యలు చేయటం ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక్క ఆదర్శ్ తప్పించి మిగిలిన అందరిపై దీక్ష వేసిన నిందలు షాకింగ్ గా మారాయి.

షోలో రింగ్ మాస్టర్ గా హరిప్రియను ఆమెను అభివర్ణిస్తే.. నటి అర్చనను స్వార్థపరురాలిగా చెప్పేసింది.

బిగ్ బాస్ ఇంట్లో ఉన్నప్పుడు చాలా అమాయకంగా.. నెమ్మదస్తురాలిగా కనిపించిన దీక్ష.. చివర్లో ఇలా వ్యాఖ్యలు చేయటమే కాదు..తాను అన్న మాటల విషయంలో వాదనకు దిగేందుకు సైతం వెనుకాడకపోవటం విశేషం. మొత్తంగా చూస్తే.. బిగ్ బాస్ ఇంట్లో ఉన్నప్పుడు సెలబ్రిటీలు ప్రదర్శించే తీరుకు భిన్నంగా దీక్ష కనిపించారని చెప్పక తప్పదు. తన తీరుతో పలువురి మనసుల్ని దోచుకున్న దీక్ష.. బిగ్ బాస్ ఇంటి నుంచి వెళ్లే సమయంలో ఆమె తీరు నెగిటివ్ గా ఉండటంతో పాటు.. దీక్ష మరీ అంత అమాయకురాలేమీ కాదన్నట్లుగా ఉందని చెప్పక తప్పదు.

,  ,  ,  ,