Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Apr-2016 12:02:34
facebook Twitter Googleplus
Photo

జబర్దస్త్.. ఖతర్నాక్ కామెడీ షో అంటూ తెలుగు వారికి బాగా దగ్గరైంది ఈ టీవీ షో. మొదట్లో ఉన్నంత కామెడీ పంచ్ లు లేకపోవడం స్కిట్స్ రిపీట్ గా అనిపించడం ఉన్న వాటిలో బూతు కంటెంట్ పెరగడంతో.. ఇప్పుడీ షోకి క్రేజ్ తగ్గుతున్న మాట వాస్తవమే. అయితే.. ఈ జబర్దస్త్ నుంచి ఓ జడ్జ్ ను తొలగించేందుకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది.

జబర్దస్త్ కార్యక్రమానికి మెగా బ్రదర్ నాగబాబు - ఒకనాటి హీరోయిన్ ఇప్పటి ఎమ్మెల్యే అయిన రోజా జడ్జ్ లుగా ఉన్నారు. వీరిలోంచి రోజాను తప్పించాలని ప్రొడ్యూసర్స్ నిర్ణయించారని తెలుస్తోంది. త్వరలోనే ఈమె స్థానంలోకి మరో హీరోయిన్ వచ్చి చేరనుందని తెలుస్తోంది. కొత్త జడ్జ్ గా రాబోయే హీరోయిన్ పేరు కానీ రోజాను తప్పించడానికి కారణాలు మాత్రం తెలియరాలేదు.

రీసెంట్ గా ఎమ్మెల్యే రోజా అసెంబ్లీకి సంబంధించిన ఓ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఏళ్ల తరబడి నడుస్తున్న జబర్దస్త్ షో నుంచి తప్పించడానికి అదే కారణంగా చెప్పుకుంటున్నారు. ఆమెను చుట్టుముట్టిన కాంట్రవర్సీలే ఇందుకు కారణం అంటున్నారు. మరి జబర్దస్త్ లో ప్రదర్శించే స్కిట్స్ పై కూడా చాలానే కాంట్రవర్సీలున్నాయిగా అనుకుంటున్నారు జనాలు.

,  ,  ,  ,  ,  ,  ,  ,