Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Jan-2016 11:48:09
facebook Twitter Googleplus
Photo

రవితేజ అంటేనే ఫుల్లు ఎనర్జీ. మరి అందరూ రవితేజ లాగానే కనిపిస్తే ఎలా ఉంటుంది? రచ్చ రచ్చగా ఉండదూ. రవితేజ బర్త్ డే పార్టీ ఈ రేంజ్ లోనే జరిగింది. నటుడు బ్రహ్మాజీ ఆధ్వర్యంలో ఏర్పాటైన రవితేజ బర్త్ డే పార్టీకి.. థీమ్ గా మాస్ మహరాజ్ నే ఎంపిక చేశారు. అంటే ఈ పార్టీకి వచ్చే వాళ్లందరూ రవితేజ మాదిరిగానే డ్రస్సింగ్ చేసేసుకుంటారన్నమాట.

దగ్గుబాటి రాణా.. డార్క్ రెడ్ కలర్ టీ షర్ట్ తో వస్తే అల్లు శిరీష్ విక్రమార్కుడు స్టైల్లో ఖాకీ డ్రస్ వేసుకొచ్చేశాడు. మాజీ హీరో ప్రెజెంట్ స్టైలిష్ విలన్ జగపతిబాబు - డైరెక్టర్లు హరీష్ శంకర్ - మెహర్ రమేష్.. ఇలా బోలెడు మంది తారాగణం మాస్ మహరాజ్ పుట్టిన రోజు వేడుకలో సందడి చేశారు. ఇక హీరోయిన్స్ సంగతైతే మరీ రచ్చ రంబోలానే. రకుల్ ప్రీత్ సింగ్ - రాశి ఖన్నా - లావణ్యా త్రిపాఠి - రెజీనా కసాండ్రాలు మీసాలు పెట్టుకొచ్చి నానా హంగామా సృష్టించారు.

బ్లూ కలర్ ధోతీ ధరించి మంచు లక్ష్మి మరీ డిఫరెంట్ గా హల్ చల్ చేసింది. అంతా కలిసి రవితేజ సినిమాల్లో సాంగ్స్ డ్యాన్సులు వేసి బాగా ఎంజాయ్ చేశారు. ప్రోగ్రాంని బ్రహ్మాజీ నిర్వహించగా.. ఆయన భార్య సరస్వతి అద్భుతమైన వంటకాలను వచ్చిన స్టార్లు అందరూ తెగ పొగిడేశారు. బర్త్ డే పార్టీలకు డిఫరెంట్ థీమ్స్ ఎంచుకోవడం చూస్తున్నాం కానీ.. ఇలా రవితేజ బర్త్ డేకి మాస్ మహరాజ్ నే థీమ్ గా సెట్ చేసి ఈ పార్టీతో ఓ ట్రెండ్ క్రియేట్ చేసేశారు.

,