Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Jul-2017 12:54:54
facebook Twitter Googleplus
Photo

సినిమాలలో ఒక్కసారిగా అవకాశాలు తగ్గటంతో కాజల్ అగర్వాల్ పని ఇక అయిపోయింది అని అనుకున్నారు. సౌత్లో సినిమాలు లేకపోవడంతో అటు వెళ్ళి హిందీలో కూడా ప్రయత్నాలు చేసింది. అక్కడ కూడా ఓ మూడు సినిమాలు చేసిన అమ్మడు సినీ కెరియర్ కు అంతా ప్లస్ కాలేదు. మళ్ళీ ఇప్పుడు సౌత్లో కాజల్ అగర్వాల్ టైమ్ వచ్చినట్లు అనిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి 150 చిత్రం తరువాత మళ్ళీ పెద్ద సినిమాలు ఏవి తన చేతిలో లేవు అనుకున్న సమయంలో ఒక్కసారిగా బంపర్ ఆఫర్ కొట్టింది కాజల్. కాజల్ ఇప్పుడు తీరిక లేకుండా షూటింగ్లు చేస్తుంది. వచ్చే నెలలో కాజల్ నటించిన మూడు సినిమాలు విడుదల కాబోతున్నాయి.

ఇండస్ట్రిలో పదేళ్ళు కన్నా ఎక్కువ కాలం ఒక హీరోయిన్ ఉండదు అనే కోవలో కాజల్ చేరిపోతుంది అనుకున్నారు అంతా. కానీ ఇప్పుడు కాజల్ కెరియర్ ఊపు అందుకుంది. ఆగష్టు నెల మొత్తం ఆమెదే అని చెప్పవచ్చు. ఎందుకంటే తేజ డైరెక్టర్ గా రానా హీరోగా వస్తున్న ‘నేనే రాజు నేనే మంత్రి సినిమా ఆగష్టు 11 నాడు విడుదల కాబోతుంది. అలాగే మరో రెండు తమిళ్ డబ్బింగ్ సినిమాలు కూడా విడుదల అవుతున్నాయి. తమిళ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా నటించిన వివేగం.. ఆగష్టు 10న విడుదల అవుతుంది. ఈ సినిమా తెలుగులో వివేకం అంటూ అదే రోజు రావడానికి ట్రై చేస్తోంది. మరో తమిళ్ స్టార్ హీరో విజయ్ నటించిన మెర్సల్ సినిమా ఆగష్టు 20 న విడుదల కాబోతుంది. తెలుగులో అదిరింది అంటూ వస్తున్న ఈ సినిమా కూడా అదే డేట్ కోసం ప్రయత్నిస్తోంది. ఈ విదంగా ఒకే ఏడాదిలో మూడు సినిమాలు నుండి ఒకే నెలలో ఆ మూడు సినిమాలూ ఐదు రిలీజులుగా చూసే స్థితికి వచ్చేసింది కాజల్.

మూడేళ్ళ కిందట వరకు పెద్దగా ఏ సినిమాలూ లేకపోయిన మళ్ళీ వరస చిన్న హీరోలు పెద్ద హీరోలుతో సినిమాలు చేస్తూ బిజీ అయ్యింది కాజల్. నేనే రాజు నేనే మంత్రి లో కాజల్ చీర కట్టి పద్దతి గా కనిపించినా తమిళ్ సినిమాలు తో మళ్ళీ తన అందంతో కాజల్ అభిమానులును అలరించనుందట.

,  ,  ,  ,