Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Apr-2016 16:18:14
facebook Twitter Googleplus
Photo

పవర్‌ సినిమాకి ముందు రైటర్‌గా పని చేసే టైమ్‌లో దర్శకుడు బాబీకి ఇండస్ట్రీలో చాలా ఎలివేషన్‌ ఇచ్చేవారు. నెక్స్‌ట్‌ రాజమౌళి అవుతాడని, కమర్షియల్‌ పల్స్‌ బాగా తెలుసునని పొగిడేవారు. అందుకే పవర్‌ సినిమా ఫలితం కోసం ఇండస్ట్రీ ఆత్రుతగా ఎదురు చూసింది. కానీ ఆ సినిమా చాలా యావరేజ్‌గా వుండడంతో బాబీ అంతగా సౌండ్‌ చేయలేకపోయాడు. కాకపోతే పవన్‌కళ్యాణ్‌ దృష్టిలో పడ్డాడు. అలా సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ సినిమా చేసిన బాబీ అన్నీ పవన్‌ ఇష్టానుసారమే చేసుకుంటూ వెళ్లాడట.

పవన్‌కళ్యాణే కథ, కథనం రాయడం వల్ల దర్శకుడిగా తన మాట చెల్లేది కాదట. పవన్‌ ఏది చెప్తే దానికి అడ్డు చెప్పకుండా చేసుకుపోయిన బాబీ సినిమా హిట్టయితే క్రెడిట్‌ తనకే వస్తుందని అనుకున్నాడట. కమర్షియల్‌ సినిమానే కనుక ఆడేస్తుందిలే అనుకుంటే సీన్‌ రివర్స్‌ అయింది. ఈ చిత్రం తర్వాత తన రాత మారిపోతుందని అనుకున్న బాబీ ఇప్పుడు ఏం చేయాలనే దానిమీద దీర్ఘాలోచనలో పడ్డాడు. ఈ చిత్రం పబ్లిసిటీ కార్యక్రమాల్లో కూడా బాబీకి చోటివ్వడం లేదు. ఓ విధంగా ఇదంతా బాబీ మంచికే జరిగిందనుకోవాలి. సినిమా ఫ్లాప్‌ క్రెడిట్‌ మొత్తం పవన్‌కే వెళ్లిపోవడంతో బాబీని ఎవరూ ఏమీ అనడం లేదు. కానీ అలా హీరో మాట కాదనలేక, తన కెరియర్‌కే ప్రమాదం తెచ్చుకున్న బాబీని నమ్మి మళ్లీ పెద్ద సినిమా చేతిలో పెట్టేదెవరనేదే ఇప్పుడున్న ప్రశ్న.

,  ,  ,  ,  ,  ,  ,  ,